ఈ డిటాక్స్‌ వాటర్‌ తాగడం వల్ల అందం, ఆరోగ్యం.. వెయిట్‌ లాస్‌కు బెస్ట్‌..!!

-

తాగే నీరు స్వచ్ఛమైనప్పుడు ఆరోగ్యం, అందం రెండూ బాగుంటాయి.. ఎప్పుడైతే అవి కలుషిత మవుతాయో.. ఇవి దెబ్బతింటాయి.. నార్మల్‌ వాటర్‌ కంటే.. స్కిన్‌ గ్లోయింగ్‌ ఉండాలంటే.. కొన్ని డిటాక్స్‌ వాటర్ తాగడం మేలని సౌందర్య నిపుణులు ఎప్పుడూ చెబుతారు. ఫ్రూట్స్‌ను కూడా కట్ చేసుకుని తినడం కంటే.. దాన్ని జ్యూస్‌ చేసుకోని తాగడం వల్లే లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మనం కొన్ని డిటాక్స్‌ వాటర్‌ గురించి చూద్దాం. ఇవి మీ చర్మాన్ని అందంగాను, ఆరోగ్యంగానూ ఉంచుతాయి..

మింట్- బ్లాక్‌బెర్రీ

బ్లాక్ బెర్ర్‌ను చాలా మంది బ్లాక్ రాస్బెర్రీతో కన్ఫ్యుజ్ అవుతుంటారు. వీటిలో ఉండే ముఖ్య తేడా బ్లాక్ బెర్రీను సగం కోసినప్పుడు మధ్యభాగంలో ఖాళీ ఉండదు కానీ రాస్బెర్రీను సగంగా కోసినప్పుడు పండు మధ్యభాగం ఖాళీగా ఉంటుంది. ఈ పండును దాదాపు 2500 సంవత్సరాల నుంచి తింటూ వస్తున్నారు, ఇది మిగతా బెర్రీస్ లాగా చాలా రుచిగా ఉంటుంది. బ్లాక్ బెర్రీస్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. బ్లాక్ బెర్రీస్ లో మంచి ఆంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్లాక్ బెర్రీస్ లో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. బ్లాక్ బెర్రీస్ మెదడు యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది. వీటిలో మింట్‌ కలిపి వాటర్‌లో వేసుకుని రాత్రంతా నానపెట్టి.. ఉదయం ఖాళీ కడుపుతో తాగడమే..

దోసకాయ డిటాక్స్‌ వాటర్‌..

దోసకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఐరన్, కాల్షియం, విటమిన్ కె , పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు దోసకాయ వాటర్‌లో కేలరీలు ఉంటాయి.. దోసకాయ నీటిని రోజూ తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దోసకాయ నీటిని తయారు చేయడం చాలా సులభం. దోసకాయను ముక్కలు చేసి ఒక గాజు గ్లాసులో వేసుకుని తగినంత నీరు పోసుకుని రాత్రిపూట నానబెట్టాలి. ఉదయం అయ్యేసరికి దోసకాయ నీరు రెడీగా ఉంటుంది. ఈ నీరు రోజూ ఉదయం తాగడం వలన ఆరోగ్యానికి ఆరోగ్యం బరువు తగ్గుదలకు మంచి ఔషధం. ఎందుకంటే పందిరి దోస ఫైబర్ కలిగి ఉంటుంది. ఈ నీరు ఎముకలు ధృఢంగా ఉండేలా చేస్తాయి. దీనిలోని విటమిన్ కె శరీరంలోని రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. దోసకాయ నీరు తాగడం వలన జీవక్రియ మెరుగుపడుతుంది. సహజమైన నీటిలో ఎటువంటి ఖనిజాలు, విటమిన్లు లేవు. అయితే ఈ నీటికి దోసకాయ జత కలిపినప్పుడు.. నీరు పోషకాలను ఇచ్చేదిగా మారుతుంది. దీంతో గుండె సమస్యలను నివారిస్తుంది. మూత్రపిండాల సమస్యలను కూడా దోసకాయ నీటి సహాయంతో దూరంగా ఉంచవచ్చు. *దోసకాయలో మంచి మొత్తంలో సిలికా కంటెంట్ ఉంటుంది. ఈ దోసకాయ నీరు అంతర్గతంగా మెరుస్తున్న చర్మాన్ని అందిస్తుంది. అంతేకాదు ఇలా నీటిలో నానబెట్టిన దోసకాయను చర్మంపై అప్లై చేయడం వలన మొటిమలను తగ్గిస్తుంది.

పైనాపిల్‌ వాటర్‌..

పైనాపిల్‌లో బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉన్నాయి.విటమిన్ సి, విటమిన్ బి, విట‌మిన్ ఎ, మెగ్నీషియం, పొటాషియం, జింక్, మాంగనీస్, కాల్షియం, ఐరన్, సోడియం, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోష‌కాలు ఉండే పైనాపిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప‌ర‌గ‌డుపున పైనాపిల్ వాట‌ర్ తాగితే.మ‌రిన్ని బెనిఫిట్స్ పొందొచ్చు. పైనాపిల్ తొక్క తీసి.
చిన్న ముక్కలుగా కట్ చేసి క్ర‌ష్ చేసుకోవాలి.ఇలా క్ర‌ష్ చేసుకున్న పైనాపిల్ ముక్కల‌ను ఒక గ్లాసు చల్లటినీటిలో కలపి ప‌ర‌గ‌డుపునే తీసుకోవాలి. ఇలా రోజూ తాగడం వల్ల..వెయిట్ లాస్ అవ్వొచ్చు.కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారు పైనాపిల్ వాట‌ర్ తీసుకుంటే మంచిది. రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది. కంటి చూపు లోపిస్తున్న వారు ప్ర‌తి రోజు ఉద‌యానే పైనాపిల్ వాట‌ర్ తీసుకుంటే.అందులో ఉండే బీటా కెరోటిన్, విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తుంది. పైనాపిల్ వాట‌ర్ తీసుకుంటే.గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌లు దూరం అవ్వ‌డంతో పాటు జీర్ణ వ్య‌వ‌స్థ కూడా మెరుగు ప‌డుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంత‌క వ్యాధి ద‌రి చేర‌కుండా చేయ‌డంలోనూ పైనాపిల్ వాట‌ర్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.కాబ‌ట్టి, ప్ర‌తి ఒక్క‌రూ పైనాపిల్ వాట‌ర్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కీళ్ళ నొప్పులు ఉన్న వారు పైనాపిల్ వాట‌ర్ తాగితే.అందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పి నివారిణిగా ప‌ని చేస్తాయి.

రోజ్‌మెరి, సోంపు వాటర్‌..

జీర్ణక్రియను వేగవంతం చేయడానికి ఈ రెండు బాగా పనిచేస్తాయి.. సోంపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఈ వాటర్ ఉదయం, సాయంత్రం తాగినా శరీరంలో కొవ్వు ఈజీగా కరుగుతుంది. గుప్పడు సోంపు గింజలు తీసుకుని పొడి చేసుకోవాలి. దీన్ని మనం వంటల్లో కూడా వేసుకోవచ్చు. ఆకలిని తగ్గిస్తుంది. సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటి ఉదయాన్నే తీసుకుంటే ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంచుతుంది. ఎక్కువగా తినకుండా అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో శరీర బరువు కచ్చితంగా తగ్గుతుంది. రోజ్మమెరి, సోంపు తీసుకుని నీళ్లలో వేసి మరిగించి టీలా తాగొచ్చు.. లేదా రాత్రంతా నీళ్లలో నానపెట్టి ఉదయాన్ని అయినా తాగొచ్చు..

స్ట్రాబెరి వాటర్..

స్ట్రాబెర్రీలలో సోడియం, కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఈ పండులో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, విటమిన్ బి 9 పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో స్ట్రాబెర్రీ లు తినడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. స్ట్రాబెర్రీలో విటమిన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో పాలీఫెనాల్స్ తో పాటు పెద్ద మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అంటువ్యాధుల నుండి రక్షించడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. స్ట్రాబెరిలీను వాటర్‌లో వేసి రాత్రంతా నానపెట్టి ఉదయాన్ని తాగడమే..వీటిలో కొంచెం నిమ్మకాయ జోడించండి.. ఏ వాటర్లో అయినా నిమ్మకాయ వేస్తే.. బెనిఫిట్స్‌ డబుల్‌ అవుతాయి.

పసుపు వాటర్..

మనకు పసుపు నీళ్ల గురించి బాగా తెలుసు.. పసుపుని పురాణాల్లో దివ్యఔషధంగా భావిస్తారు. పసుపు నీరు రోగనిరోధక శక్తిని పెంచుతుంది, టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాలానుగుణ జలుబు, ఫ్లూని దూరంగా ఉంచుతుంది. ఈ రోజు స్త్రీలలో కీళ్ల నొప్పులు సాధారణ సమస్య. ప్రతిరోజు పసుపు నీరు తాగితే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. స్త్రీలలో కీళ్ల నొప్పులు సాధారణ సమస్య. ప్రతిరోజు పసుపు నీరు తాగితే ఈ సమస్య నుంచి దూరం కావొచ్చు. పసుపులో ఉండే కర్కుమిన్ మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. పసుపులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒక చిన్న పాన్ తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి. ఇప్పుడు 2 చిటికెల పసుపు వేసి కలపాలి. 1-2 నిమిషాలు మరగనివ్వాలి. నీటిని వడపోసి రుచిగా ఉండటానికి కొద్దిగా తేనెను కలుపుకొని తాగవచ్చు. స్కిన్‌ గ్లోకు ఇవి బాగా ఉపయోగపడతాయి.

దాల్చిన చెక్క వాటర్‌..

కడుపు సమస్యలను చాలా వరకు తగ్గించేందుకు దాల్చినచెక్క సహాయపడుతుంది. దీనిని ఉబ్బరం, మలబద్ధకం, వికారం నివారణ కోసం ఉపయోగిస్తారు. కడుపు పూతల నివారణకు, ఆకలిని మెరుగుపరచడంలో కూడా దాల్చినచెక్క కూడా సహాయపడుతుంది. దాల్చిన చెక్క వలన కేవలం అధిక బరువు తగ్గడమే కాదు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనం పొందవచ్చు. పొటాషియం, మాంగనీస్, కేల్షియం, జింక్ మరియు ఐరన్ లకు నిలయంగా దాల్చిన చెక్కను చెప్పుకోవచ్చు. దాల్చిన నీటిని తేనెతో కలిపి తీసుకుంటే వెయిట్ లాస్ ప్రక్రియ సులువవుతుంది. ఈ నీటికి శరీరంలోంచి టాక్సిన్స్ ను తొలగించే సామర్థ్యం కలదు. దాల్చిన నీరు మీకు ఆకలిని తగ్గిస్తుంది. నెలసరి నొప్పులతో విపరీతంగా బాధపడుతున్న మహిళలు దాల్చిన నీటిని తీసుకోవడం ద్వారా నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం పొందువచ్చు. దాల్చిన నీటిలో పోలీఫెనాల్స్ మరియు ప్రో యాంతోసియానిడిస్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా కలవు. దాల్చిన నీటిని తీసుకోవడం వలన PCOS వలన కలిగే ప్రభావాలని తగ్గించుకోవచ్చు. అలాగే, PCOS సమస్యతో సతమతమయ్యే మహిళల్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ను తగ్గిస్తుంది. దాల్చిన నీటిని తీసుకోవడం వలన జ్ఞాపకశక్తితో పాటు మెదడు పనితీరు మెరుగవుతుంది. దాల్చిన నీటిని తీసుకోవడం వలన పంటి నొప్పితో పాటు చిగుర్ల వాపును తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ పేషంట్స్ దాల్చిన నీటిని తీసుకోవడం వలన బ్లడ్ గ్లూకోస్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి. దాల్చిన నీటిని తాగడం ద్వారా క్యాన్సర్ బారిన ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. దాల్చిన నీటిని తాగడం ద్వారా ఆ ఇబ్బందిని తొలగించుకోవచ్చు. దాల్చిన నీటిని తీసుకోవడం వలన స్కిన్ టెక్స్చర్ మరియు స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news