ఒత్తిడిని తగ్గించుకోవడానికి సులువైన మార్గాలు..!

-

చాలా మంది ఒత్తిడి (stress) నుండి బయట పడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే నిజంగా ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఈ చిన్న చిన్న చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి. ఒత్తిడిని దూరం చేసుకోవడం మంచిది. లేదంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

 ఒత్తిడి /stress
ఒత్తిడి /stress

ముఖ్యంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ లేదా డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి. ఒత్తిడిని తగ్గించుకోవాలి అంటే ఐదు నిమిషాలు పాటు మెడిటేషన్ చేయడం లేదా కాసేపు వాక్ చేయడం లాంటివి చేస్తే కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

అయితే ఈ రోజు నిపుణులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని మార్గాలు చెప్పారు మరి ఆలస్యమెందుకు వాటి కోసం మనం ఇప్పుడు చూద్దాం..!

పది నిమిషాల పాటు నడవడం:

ఒత్తిడి ఎక్కువగా ఉండే సమయంలో పది నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి దూరం అయిపోతుంది. ఇంట్లో కానీ పార్క్ లేదా మీకు నచ్చిన చోట పది నిమిషాల పాటు వాకింగ్ చేయండి ఇలా చేయడం వల్ల కాస్త ఒత్తిడి తగ్గుతుంది.

స్నానం చేసేటప్పుడు ఇలా చేయండి:

మీరు స్నానం చేసేటప్పుడు ఆ టబ్ లో కొద్దిగా సాల్ట్, గులాబీరేకులు, రోజ్ ఆయిల్, రెండు స్పూన్లు బాదం ఆయిల్ వేసి మీరు స్నానం చేస్తే మంచి రిలీఫ్ మీరు పొందవచ్చు.

వ్యాయామం:

వ్యాయామం వల్ల కూడా ఒత్తిడి దూరం అవుతుంది. దీని కోసం మీరు నించుని ఆ తర్వాత వంగి మీ చేతుల్ని మీ తొడ మీద పెట్టండి మీ గడ్డం నెలకి ఎదురుగా ఉండాలి. అంటే ముఖాన్ని ముందుకు పెట్టండి. కాసేపు శ్వాస తీసుకొని వదలండి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్డ్ గా ఉండొచ్చు.

బెలూన్ ఊదడం:

బాగా ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక బెలూన్ తీసుకుని దానిని ఊదండి. ఇలా చేయడం వల్ల కూడా మీరు రిలాక్స్ గా ఉండొచ్చు.

పాజిటివ్ గా ఆలోచించడం:

ఒత్తిడి టెన్షన్ వంటి వాటి నుండి బయట పడాలంటే పాజిటివ్ గా ఆలోచించండి ఇలా చేయడం వల్ల ఇబ్బందులు పూర్తిగా దూరమైపోయి మీరు ఆనందంగా ఉండడానికి వీలవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news