వెన్ను నొప్పిని తగ్గించే వ్యాయమ పద్ధతులు మీకోసం..!

-

చాలా మంది వెన్ను నొప్పి కారణంగా వర్కౌట్స్ కి దూరంగా ఉండడం, వ్యాయామం చేయకపోవడం లాంటివి చేస్తారు. నిజంగా వెన్ను నొప్పు నుండి బయట పడడం ఎంతో కష్టం. కానీ ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా వెన్ను నొప్పి ఉండదు.

అయితే వెన్ను నొప్పి రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు కూర్చోవడం, బరువులెత్తడం వలన వెన్నులో నొప్పి వస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇది చాలా తీవ్రంగా కూడా మారిపోతుంది. స్పైన్ హైజీన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.

ఎక్కువ సేపు కూర్చున్నా, గంటల కొద్దీ డ్రైవింగ్ చేసినా, బరువులు ఎక్కువగా ఎత్తినా, స్పోర్ట్స్ వంటివి ఆడినా సమస్యలు వస్తాయి. అందుకే ఇటువంటివి చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి..?

ఈ సమస్య నుండి బయట పడాలంటే కచ్చితంగా వ్యాయామమే సరైనది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల స్పైన్ హెల్త్ బాగుంటుంది. అయితే మరి ఆ వ్యాయామ పద్దతుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నడవడం:

మనం కూర్చున్నప్పుడు లుంబార్ స్పైన్ పైన ఎక్కువ బరువు పడుతుంది. అయితే దీని కారణంగా మనకి ఇబ్బంది వస్తుంది. అందుకని నడిస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. అరగంట సేపు కూర్చున్నాక మధ్యలో మూడు నిమిషాల పాటు నడవడం వల్ల కాస్త రిలీఫ్ గా ఉంటుంది.

బెడ్ బగ్:

నేల మీద వెన్ను నేలకి ఉండేటట్టు పడుకుని.. రెండు చేతులు ఇరువైపులా పెట్టి ఇప్పుడు మోకాళ్లని 90 డిగ్రీల లోకి తీసుకు రండి. ఇప్పుడు మీరు మీ యొక్క వెన్నుని గచ్చుకి దగ్గరగా ఉండేటట్లు చూడండి. ఇప్పుడు కుడి కాలు మరియు ఎడుమ చెయ్యిని ఎక్స్టెండ్ చెయ్యండి. ఆ తర్వాత కుడి చెయ్యిని ఎడుమ కాలిని ఎక్స్టెండ్ చేయండి.

సైడ్ ప్లాంక్:

మొదట మీరు మీ చెయ్యితో పక్కకి బాలన్స్డ్ గా వుండండి. మీ యొక్క నడుము, కాళ్ళు, మోచెయ్యి మరొక పక్కకి ఉంచండి. మీ నడుముని నేలకి ఆనించద్దు. ఇలా 30 సెకండ్లు పాటు ఈ పోజ్ లో వుండండి.

Read more RELATED
Recommended to you

Latest news