ఈ ఇంటి చిట్కాలతో కొద్దిపాటి కరోనా లక్షణాలు మాయం..!

-

కరోనా వైరస్ కారణంగా ఎందరో మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉంటే ఈ ఇంటి చిట్కాలు పాటించడం మంచిదని నిపుణులు చెప్తున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కూడా ఈ ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

ఈ ఇంటి చిట్కాలను అనుసరించండి:

డికాషన్ చాలా అవసరం. మీకు కనుక కొద్దిగా జలుబు జ్వరం దగ్గు ఉంటే ఈ డికాషన్ తాగండి.
దీని కోసం మీరు కొద్దిగా నీళ్ళలో అల్లం ముక్కలు వేసి మరిగించుకుని ఆ నీటిని తాగండి.
నీళ్ళు సగం అయ్యే వరకు కూడా మరిగించడం మర్చిపోకండి.
అందులోనే మీరు కావాలంటే కొద్దిగా తులసి ఆకులు కూడా వేసుకోవచ్చు.
దీనిని మూడు నుండి నాలుగు సార్లు వరకు కూడా తాగొచ్చు.

తాజా ఆహారం మాత్రమే తీసుకోండి:

మీరు కనుక జలుబు దగ్గుతో బాధ పడుతుంటే వేడిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. పెసర పప్పు సూప్ నూనె వేయకుండా సాల్ట్ వేయకుండా భోజనం సమయంలో తీసుకోండి.
ఏదీ అతిగా తినొద్దు.
ప్రతి మీల్ తర్వాత కడుపును ఖాళీగా ఉంచండి.
రాత్రి డిన్నర్ ని ఏడు గంటల కంటే ముందే తినండి.

ఈ మసాలా దినుసులు తీసుకుంటే మంచిది:

దగ్గు, జలుబు వెంటనే తగ్గాలంటే దాల్చినచెక్క, నల్ల మిరియాలు, యాలుకలు లవంగాలు ఆహారంలో వేసుకుని తీసుకోవచ్చు.
పసుపు, అల్లంని కూడా వంటల్లో ఎక్కువగా వాడండి.
వీటిలో ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.

ఈ టిప్స్ కూడా పాటించండి:

ఏ కూరగాయల్ని తిన్న బాగా ఉడికించుకుని తినండి.
పచ్చి సలాడ్స్, పచ్చి కూరగాయలు తీసుకోవద్దు.
టమాటా, వంకాయ, బంగాళదుంపని తక్కువగా తీసుకుంటూ ఉండండి.
ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news