ఈ ఆహారపదార్ధాలని మళ్ళీ వేడి చేసుకుని తినకూడదు..!

సాధారణంగా మనం వంట చేసుకుని అన్నం తినేటప్పుడు ఆహారం వేడిగా ఉండాలని వేడి చేసుకుని తినే అలవాటు చాలా మందికి ఉంటుంది. అయితే అలా మళ్లీ వేడి చేసుకుని ఈ ఆహారపదార్థాలు అస్సలు తినకూడదట. మరి ఆ ఆహార పదార్థాల గురించి ఇప్పుడే చూసేయండి.

Foods that You Must Stop Reheating
Foods that You Must Stop Reheating

గుడ్లు

వండిన వెంటనే గుడ్లని తినేయాలి. ఎప్పుడూ కూడా వాటిని మళ్లీ వేడి చేసుకోకూడదు. గుడ్లలో నైట్రోజన్ సమృద్ధిగా ఉంటుంది. మరొకసారి వాటిని వేడి చేయడం వల్ల క్యాన్సర్ రిస్కు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ గుడ్లని వేడి చేయొద్దు.

అన్నం

చాలా మంది ఉదయాన్నే ఒకేసారి అన్నం వండేసి ఉదయం తినేసిన తర్వాత మిగిలిన అన్నాన్ని వేడి చేసుకుని రాత్రి తింటారు. ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీ ప్రకారం మరొకసారి అన్నాన్ని వేడి చేయడం వల్ల అది విషంతో సమానం. కాబట్టి ఎప్పుడూ మరొకసారి అన్నాన్ని వేడి చేయొద్దు.

బంగాళదుంపలు

బంగాళదుంపలో విటమిన్ బి6, పొటాషియం మరియు విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయి. బంగాళదుంప మరొకసారి వేడి చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా పెరిగి పోతుంది. కాబట్టి ఒకవేళ బంగాళదుంప కూర మిగిలిపోయినా మరొకసారి దానిని వేడి చేయదు వేడి చేసి తిన్నారంటే ఇబ్బందులు తప్పవు.

చికెన్

ఒకసారి వండిన చికెన్ ని మరొకసారి వేడి చేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి ఎప్పుడూ కూడా మరొకసారి చికెన్ ని వేడి చేసి తినద్దు. ఏ రకమైన కూరగాయలని వేడి చేసి తినడం మంచిది కాదు ముఖ్యంగా క్యారెట్లు అసలు అలా తినకూడదు దీంతో సమస్యలు వస్తాయని తెలుసుకోండి.

పుట్ట‌గొడుగులు

పుట్ట‌గొడుగులు ప్రోటీన్‌ల పవర్‌హౌస్ మరియు పెద్ద మొత్తంలో ఖనిజాలను కలిగి ఉండి ఆరోగ్యానికి చాలా మంచింవి. పుట్ట‌గొడుగుల‌ను వండిన వెంట‌నే తినాలి, మ‌రుస‌టి రోజుకు నిల్వ ఉంచుకొని తిన‌డం కూడా అంత మంచిది కాదు. ఇక పుట్ట‌గొడుగుల‌ను మ‌ళ్లీ వేడిచేయ‌డం ద్వారా అందులో ఉండే ప్రొటీన్‌లు విచ్చిన్క‌నం కాబ‌డతాయి, ఆక్సిడైజ్డ్ నైట్రోజన్ మరియు ఫ్రీ రాడికల్స్ కలిగిన టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ‌పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపించే అవ‌కాశాలు ఉంటాయి.

పుట్ట‌గొడుగుల పెంప‌కం.. నెల‌కు రూ.2.50 ల‌క్ష‌ల ఆదాయం