కొలెస్ట్రాల్ మొదలు జీర్ణ సమస్యల వరకు బిర్యానీ ఆకుతో ఎన్నో లాభాలు..!

-

బిర్యానీ చేసేటప్పుడు మనం ఇతర మసాలా సామాన్లతో పాటు బిర్యానీ ఆకుని వాడుతూ ఉంటాం. అయితే ఈ బిర్యానీ ఆకు వల్ల రుచి మాత్రమే వస్తుందనుకుంటే పొరపాటు. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. డయాబెటిస్ ని కంట్రోల్ చేయడానికి, కార్డియోవాస్క్యులర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఇంఫ్లమేషన్ ని తగ్గించడానికి ఇలా ఎన్నో వాటికి బిర్యానీ ఆకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజు బిర్యానీ ఆకు వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు అనేది చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి.

 

జీర్ణ ప్రక్రియను ఇంప్రూవ్ చేస్తుంది:

బిర్యానీ ఆకు జీర్ణ సమస్యలను పోగొడుతుంది. కోలన్ క్యాన్సర్, అబ్డామినల్ క్యాన్సర్, ఇంటెస్టినల్ క్యాన్సర్ వంటి వాటి నుండి బయట పడేస్తుంది. అలానే కాన్స్టిపేషన్, బ్లోటింగ్ వంటి సమస్యల నుండి కూడా ఇది బయట పడేస్తుంది. కాబట్టి బిర్యానీ ఆకును వంటలో ఎక్కువగా వాడితే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

యాంటీఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు:

బిర్యానీ ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇంఫ్లమేషన్ వంటి సమస్యలను తొలగిస్తుంది. అదేవిధంగా ఆస్తమా వంటి వాటి నుండి కూడా బయటపడొచ్చు.

రెస్పిరేటరీ హెల్త్ కి మంచిది:

రెస్పిరేటరీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ నుండి ఇది రక్షిస్తుంది.

కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది:

కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కార్డియోవాస్క్యులర్ సమస్యలు కూడా రావు.

హైబీపీ సమస్య ఉండదు:

బ్లడ్ సర్కులేషన్ బాగా అయ్యేటట్టు చూస్తుంది. హైపర్ టెన్షన్ నుండి రిలీఫ్ ని పొందొచ్చు కూడా ఇలా ఎన్ని లాభాలు బిర్యానీ ఆకుతో మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news