అల్లం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రెగ్యులర్ గా వంటల్లో అల్లంను ఉపయోగించడం వల్ల చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయుర్వేద మందులులో కూడా అల్లాన్ని వాడతారు.
దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఆస్తమా, ఫ్లూ వంటి సమస్యలు తొలగించడానికి అల్లం బాగా ఉపయోగపడుతుంది. అయితే అల్లం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు..?, ఎలాంటి సమస్యలనుంచి దూరంగా ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.
వికారం తగ్గుతుంది:
అల్లం లో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది వికారం సమస్యను తగ్గిస్తుంది. చాలామంది గర్భిణీలకు ఉదయాన్నే వికారం, వాంతులు వంటి ఇబ్బందులు ఉంటాయి. అటువంటి వాళ్ళు అల్లాన్ని తీసుకోవడం వల్ల వికారం, వాంతులు సమస్య నుండి బయట పడవచ్చు.
జీర్ణం బాగా అవుతుంది:
జీర్ణ సమస్యలను కూడా అల్లం తొలగిస్తుంది. అలానే గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి కూడా బయట పడేస్తుంది. బ్లోటింగ్ లాంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది.ఆకలిని పెంచుతుంది.
బరువు తగ్గొచ్చు:
బరువు తగ్గడానికి కూడా అల్లం బాగా ఉపయోగపడుతుంది. ఇది కొవ్వును కరిగిస్తుంది. అధిక బరువు ఉన్నవాళ్లు అల్లాన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
అల్లం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది అల్లం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూసుకుంటుంది.
నెలసరి సమస్యలు తగ్గుతాయి:
చాలా మంది మహిళలు నెలసరి సమయంలో వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. కడుపు నొప్పి, మెన్స్ట్రుల్ క్రామ్ప్స్ వంటి సమస్యల నుండి అల్లం బయటపడేస్తుంది. అలానే జాయింట్ పెయిన్స్ మొదలైన సమస్యలు ఉండి కూడా అల్లం బయటపడేస్తుంది. అలానే ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవుతుంది.