తిరుమల : ఏపీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి మరోసారి సంచలన వాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు సోమువిర్రాజు కాదు కదా….ఆయనను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ని జైలుకు పంపలేరని ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ఏపీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి. మోడికి విజ్ఞప్తి చేస్తూన్నా….సోము విర్రాజు లాంటి వారు అధ్యక్షులుగా వుంటే….బిజేపికి డిఫాజిట్లు కూడా రావని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి.
చీఫ్ లిక్కర్ ఇచ్చి….ఓట్లు అడిగే దౌర్బాగ్య స్థితికి సోము విర్రాజు చేరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి. తెలుగుదేశం అజేండాను బిజేపి పార్టీ అమలుపరుస్తూందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో భారతీయ జనతా పార్టీ ఆటలు అస్సలు సాగవని హెచ్చరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు సిఎం జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వైపే ఉంటారని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సిఎం నారాయణస్వామి.