ఆ మహిళలు సెక్స్ పట్ల ఎందుకు ఆసక్తి చూపరంటే..?

-

శృంగారం అంటే ఇష్టం లేని వాళ్లుంటారంటే అతిశయోక్తి లేదు.సెక్స్ లో పాల్గొనాలని అబ్బాయిలకు ఎంత ఆసక్తి ఉంటుందో అమ్మాయిలకు కూడా అంతే ఉంటుంది. కానీ అమ్మాయిలు బయటపడరు. దీనికి వాళ్లు పెరిగిన వాతావరణం, సమాజ పోకడలు కారణం కావొచ్చు. శృంగారాన్ని ఇష్టపడని వాళ్లు కూడా ఉంటారా అనే సందేహం కొందరిలో కలగొచ్చు. అయితే శృంగారం అంటే అస్సలు ఆసక్తి లేని మహిళలు కూడా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి గల కారణాలను చెబుతున్నారు.

కొందరు మహిళలకు శృంగారంపై ఆసక్తి ఉండదట. దీనికి కారణం వాళ్ల పెంపకం. ఇంట్లో వాళ్ల పెంపకం వల్లే కొందరి మహిళల్లో సెక్స్ పై ఆసక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొందరి కుటుంబాల్లో శృంగారం గురించి మాట్లాడటం, ఆలోచించడం తప్పని పెద్దలు చెబుతుంటారు. “చిన్నప్పటి నుంచి సెక్స్​ అంటే తప్పు.. స్త్రీలు శృంగారం​ పట్ల ఆసక్తి చూపించడం సరైన పద్ధతి కాదు, స్త్రీలు అలా ఉండకూడదు అనే ఒక భావజాలంతో వాళ్లను పెంచుతారు. పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి.. అంతే తప్ప సెక్స్​ గురించి మాట్లాడటం వంటివి చేయకూడనే భావజాలానికి ప్రభావితమైన వారు శృంగారం పట్ల ఆసక్తి చూపించరు” అని నిపుణులు పేర్కొన్నారు.

శృంగారం పట్ల మహిళలకు ఆసక్తి లేకపోవడానికి మరో కారణం హైపోథైరాయిజం. థైరాయిడ్​ హార్మోన్​ తక్కువ ఉన్నా, ఈస్టర్న్​ హార్మోన్స్​ తక్కువ ఉన్నా కూడా సెక్స్​పైన ఆసక్తి తగ్గుతుంది. పాలిసిస్టిక్​ ఒవేరియన్​ డిసీజ్​ ఉన్న వారిలో యాండ్రోజెన్స్​ ఎక్కువ పెరుగుతాయి. అంటే మగవాళ్ల హార్మోన్లు పెరుగుతాయి. రక్త హీనత, స్ట్రెస్​, రిలేషన్​షిప్​ ప్రాబ్లమ్ ఉన్నా కూడా సెక్స్​పై ఆసక్తి తగ్గిపోతుంది. వైద్యులను సంప్రదించి సైకో థెరపీ​ చేయించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news