స్వతంత్ర భార‌త స్ఫూర్తిని తెలియజేసేందుకు ఈ వేడుకలు : సీఎం కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత స్వతంత్ర వజోత్సవాల పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన స్వ‌తంత్ర భార‌త వ‌జ్రోత్స‌వ ముగింపు వేడుక‌ల్లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ.. పేద‌ల ఆశ‌లు నెర‌వేర‌లేదు.. అనేక వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ‌కు స్వ‌తంత్ర‌ ఫ‌లాలు సంపూర్ణంగా అంద‌ట్లేద‌నే ఆవేద‌న మ‌న‌కు క‌న‌బ‌డుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. వాట‌న్నింటిని విస్మ‌రించి ఈ దేశాన్ని ఉన్మాద స్థితిలోకి నెట్టివేసేందుకు కుటిల ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌డాన్ని మ‌నమంతా చూస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. మౌనం వ‌హించ‌డం స‌రికాదని, అర్థమైన త‌ర్వాత కూడా అర్థం కాన‌ట్టు ప్ర‌వ‌ర్తించ‌డం మేధావుల ల‌క్ష‌ణం కాదన్నారు సీఎం కేసీఆర్. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు క‌ర‌దీపిక‌లుగా మారి ఏ స‌మాజాన్ని అయితే స‌క్ర‌మ‌మైన మార్గంలో న‌డిపిస్తారో ఆ స‌మాజం గొప్ప‌గా పురోగ‌మించే అవ‌కాశం ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్రసంగంలోని హైలెట్స్ ఇవే..! | Key highlights of telangana cm  kcr speech | TV9 Telugu

గాంధీ గురించి ఈ త‌రం పిల్లల‌కు తెలియాలి మ‌న దేశంలో మ‌న రాష్ట్రానిది ఒక ప్ర‌త్యేక‌మైన స్థానమని, స్వ‌తంత్ర భార‌త స్ఫూర్తిని ఈ త‌రం పిల్ల‌ల‌కు, యువ‌కుల‌కు తెలియ‌ని వారికి విస్తృతంగా తెలియ‌ప‌ర‌చాల‌నే ఉద్దేశంతో ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు సీఎం కేసీఆర్. అన్నింటిని మించి ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో తాను చెప్పిన‌ట్లు విశ్వ‌జ‌నీన‌మైన సిద్ధాంతాన్ని, అహింసా వాదాన్ని, ఎంత‌టి శ‌క్తిశాలులైనా స‌రే శాంతియుత ఉద్య‌మాల‌తో జ‌యించొచ్చ‌ని ప్ర‌పంచ మాన‌వాళికి సందేశం ఇచ్చిన మ‌హ్మ‌త్ముడు పుట్టిన గ‌డ్డ మ‌న భార‌తావ‌ని అని సీఎం కేసీఆర్ కొనియాడారు. అటువంటి దేశంలో గాంధీ గురించి, ఆయ‌న యొక్క ఆచ‌ర‌ణ గురించి, స్వాతంత్య్ర‌ పోరాటంలో ఉజ్వ‌లంగా వారు నిర్వ‌హించిన పాత్ర గురించి ఈత‌రం పిల్ల‌ల‌కు తెలియాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్.

 

Read more RELATED
Recommended to you

Latest news