కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్లాడు..పొట్టలో 63స్పూన్లు చూసి నోరెళ్లబెట్టిన డాక్టర్లు..!!

-

ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాట్లు ఉంటాయి. కొందరు బియ్యం తింటారు, మరికొందరు చాక్‌పీస్‌లు, మట్టి తింటారు. కానీ ఇతని అల్ట్రా లెజెండ్‌. గత ఏడాదిగా చేతికి దొరికిన స్పూన్లను మింగేస్తున్నాడు. అలా తినీ, తినీ పొట్ట నిండిపోవడంతో కడుపు నొప్పి వచ్చింది. వైద్యులను సంప్రదించాడు.. వాళ్లు అతని కడుపులో స్పూన్లు చూసి షాక్‌కు గురయ్యారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ముజఫర్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో విజయ్ కుమార్ అనే 32 ఏళ్ల యువకుడు తాగుడుకు అలవాటు పడ్డాడు. రోజు రోజు మద్యానికి మరింత బానిస కావడంతో.. అతడిని డి-అడిక్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు. కొంత కాలంగా అక్కడే ఉంచారు. ఇటీవల కడుపునొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. మద్యానికి అలవాటై ఇలా చెప్తున్నాడని లైట్‌ తీసుకున్నారు..కానీ అతడికి మరోసారి తీవ్ర స్థాయిలో కడుపు నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. విజయ్‌ను పరిశీలించిన డాక్టర్లు పలు పరీక్షలు చేశారు. ఆయన టెస్టు రిపోర్టులు చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు.

విజయ్ కడుపులో పెద్ద మొత్తంలో స్టీల్ స్సూన్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొంత మంది డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి సుమారు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు. అతడి పొట్టలో నుంచి ఏకంగా 63 స్పూన్లు బయటకు తీశారు. అన్ని స్పూన్లు కడుపులో ఉండటం పట్ల వైద్యులు ఆశ్చర్యపోయారు.

ఆపరేషన్ తర్వాత స్పూన్లు కడుపులోకి ఎలా వెళ్లాయి? అనే అంశం గురించి ఆరా తీశారు. తానే ఏడాది కాలంగా స్పూన్లను తింటున్నానని చెప్పడంతో డాక్టర్లు షాక్ అయ్యారు. మరోవైపు డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకులే విజయ్ చేత బలవంతంగా స్పూన్లు తినిపించి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు… కానీ, పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. ప్రస్తుతం విజయ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.. సర్జరీ తర్వాత అతడిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఇన్ఫెక్షన్ తగ్గితే ప్రాణాలతో బయటపడే అవకాశాలున్నాయి. ఇంతకీ అతను ఎందుకు స్పూన్లు తిన్నాడు అనేది చెప్పలేదు. ప్రస్తుతం అతను బతికితే చాలని కుటుంబసభ్యులు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news