ఫిల్టర్ కాఫీతో ఆ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

-

డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు. తీరు అది వారికి లేదా వారి ఇంట్లో వారికి ఎవరికో ఒక్కరికి వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి తెలుకోవడానికి ప్రయత్నిస్తారు. డయాబెటిస్ అనేది కొందరిలో ఒక్కసారిగా కొట్టొచ్చినట్లు తెలుస్తాయి. మరికొందరిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనబడ్డా దాన్ని అంత త్వరగా డయబెటిస్ లక్షణాలుగా గుర్తించరు. ఇదిలా ఉంటే ఫిల్టర్ కాఫీతో టైప్-2 డయాబెటిస్‌ను దూరం చేయవచ్చని తాజా పరిశోధనలో తేలింది. స్వీడన్‌లోని చామర్స్ యూనివర్సిటీ, యూమియా యూనివర్సిటీలు నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

టైప్-2 డయాబెటిస్‌ ముప్పును నివారించడంలో ఫిల్టర్ కాఫీ విశేషంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కొన్ని రోజులుగా ఫిల్టర్ చేసిన కాఫీని తాగిన వారి రక్తంలోని అణువులను పరీక్షించగా టైప్-2 డయాబెటిస్ ముప్పు కొంత దూరమైనట్టు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మధుమేహాన్ని నివారించడంలో కాఫీ పాజిటివ్ ఫలితాన్ని ఇచ్చిందన్నారు. అయితే, వేడి చేసి తీసుకున్న కాఫీతో ఇలాంటి ఫలితం రాలేదన్నారు. రోజుకు రెండు, మూడు కప్పుల ఫిల్టర్ కాఫీ తాగే వారిలో టైప్-2 డయాబెటిస్ ముప్పు 60 శాతం దూరమైనట్టు తమ పరిశోధనలో తేటతెల్లమైనట్టు వారు తెలిపారు. అలా అని ప‌రిమితికి మంచితే మాత్రం ఏదైనా ముప్పే.

Read more RELATED
Recommended to you

Latest news