ఇప్పుడు ఎలా అయిపోయిందంటే..డైట్ చేయాలి..కానీ ఇష్టమైన ఫుడ్ మాత్రం మానకూడదు..టేస్టీగా ఉండే ఫుడ్ తినాలి కానీ..దానివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకూడదు..దాదాపు అందరూ ఇలానే అనుకుంటారు. మీరు ఇది వినే ఉంటారుగా నిజం చేదుగా ఉంటుంది. అబద్ధం తియ్యగా ఉంటుంది అని. టాబ్ లెట్ టేస్టీగా ఉండదు..కానీ వేసుకుంటేనే సమస్య పోతుంది. కొంతమందికి పాలు నచ్చవు కానీ తాగితేనే ఆరోగ్యం. అలానే తాటిబెల్ల చూడడ్డానికి ఏమాత్రం బాగుండదు..కానీ అదే ఆరోగ్యానికి మంచిది.. మనం వండే తీపి వంటకాల్లో పంచదారనే బాగా వాడుతుంటాం..కానీ దానివల్ల కలుగుతున్న దుష్ప్రభవాలు ఒక్కొక్కటి బయటపడటంతో ఈమధ్య కొందరు తాటిబెల్లం పై దృష్టిపెడుతున్నారు.
తాటిబెల్లం ఆరోగ్యానికి ఎంతో ఆరోగ్యకరం..ఆయుర్వేదంలో తాటి బెల్లం వాడకం గురించి ప్రత్యేకంగా వివరిస్తుండటంతో కొందరు తాటిబెల్లం వినియోగం వైపు మొగ్గుచూపుతున్నారు. రోగనిరోధక శక్తి పెంచి, రసాయన రహితమైన ఆర్గానిక్ తరహాలో తాటిబెల్లం తయారు చేస్తారు. తాటి బెల్లం పూర్తిగా ఆర్గానిక్ కావడంతో పాటు, ఇందులో ఎక్కువ మొత్తంలో పోషకాలు ఉంటాయి.
అధిక మొత్తంలో విటమిన్స్, మినరల్స్ తాటిబెల్లంలో ఉంటాయి. ఇది త్వరగా ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు ఉండవు. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి చక్కగా బయట పడవచ్చు. తాటి బెల్లంలో అవసరమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఇది చక్కెర కంటే 60 రెట్లు ఎక్కువ ఖనిజాలను కలిగి ఉంది. అలాగే ఖనిజాలతో పాటు అనేక విటమిన్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి.
ఈ బెల్లంలో చిన్నపాటి జబ్బులను దూరం చేయగలిగిన సుగుణాలు ఎన్నో ఉన్నాయట. వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటి బెల్లం తినడం ద్వారా చెక్ పెట్టొచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇనుము ఉంటాయి. పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం చాలా ఉపయోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఏది ఎంత ఉంది..
మాంసకృత్తులు 1.04,
తాటి బెల్లంలో తేమ 8.61 శాతం
సుక్రోజు 76.86
కొవ్వు 0.19
కాల్షియం 0.86
ఫాస్ఫరస్ 0.05
ఖనిజ లవణాలు 3.15 శాతం,
రెడ్యూసింగ్ చక్కెర 1.66,
ముఖ్యంగా తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చట. తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల మన శరీరంలో దెబ్బతిన్న కణాల పునరుత్పత్తి జరుగుతుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణలు. అదేవిధంగా శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో ఏ విధమైన మలినాలు పేరుకుపోయినా అవి తొలగిపోతాయట. ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా ఉంటాయి.
తాటి బెల్లం క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుందట. అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. పొడి దగ్గు ,ఆస్త్మా వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుందట. గోరు వెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగడం వలన జలుబు, దగ్గు దెబ్బకి మటుమాయం!
తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. వాటి వల్ల పోషణ లభిస్తుంది. మైగ్రేన్ వంటి అధిక తలనొప్పి సమస్య ఉన్నవారు తాటిబెల్లంను తింటే మంచి ప్రయోజనం కలుగుతుంది. అదేవిధంగా ఈ బెల్లాన్ని తింటే అధిక బరువును కూడా తగ్గించుకోవచ్చు.
తాటి బెల్లం మీ రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది అంతేకాదు.. ఆస్తమాను తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నిమంత్రిస్తుంది. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, మరియు భాస్వరం తాటిబెల్లంలో సమృద్ధిగా ఉంటాయి. ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది. దీన్ని డైలీ తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి కలుగుతుంది.
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండీ తాటిబెల్లంలో..ఇప్పటినుంచి అయినా ఈ బెల్లం వాడేందుకు ఓ సారి ట్రై చేసి చూడండి మరి.!
– Triveni Buskarowthu