Health : వెన్నెముకను నిటారుగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు

-

కుర్చీలో కూర్చున్నప్పుడు గానీ, సోఫాలో చేరగిలబడినప్పుడు గానీ వెన్నెముకను నిటారుగా ఉంచకుండా ముందుకు వంచి కూర్చునే అలవాటు ఉన్నవారు అలెర్ట్ అవ్వాల్సిందే. వెన్నెముకను నిటారుగా కాకుండా ముందుకు వంచడం వలన శరీర ఆకారం వికృతంగా కనిపిస్తుంది. అంతేకాదు, దీనివల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

వెన్నుముకను ముందుకు వంచడం వలన ఊపిరితిత్తుల్లో సమస్య ఏర్పడే అవకాశం ఉందట. ఇంకా, ఆహారం సరిగ్గా అరగకపోవడం, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే వెన్నెముకను వంచకుండా చూసుకోవాలి. దానికోసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.

కంప్యూటర్ డెస్క్ ముందు జాగ్రత్త

కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు చాలామంది తలను ముందుకు వంచేసి భుజాల భాగాన్ని కూడా ముందుకు వంచుతారు. ఇకపైన అలా కూర్చోవడం మానేయండి. కంప్యూటర్ ముందు సౌకర్యంగా కూర్చునేందుకు వీలున్న కుర్చీలను మాత్రమే వాడండి.

మొబైల్ ఫోన్ వాడేటప్పుడు జాగ్రత్త

మొబైల్ ఫోన్లో ఏదైనా చూస్తున్నప్పుడు తలను కిందకు వంచేస్తారు. ఇకపైన అలా చూడకుండా మొబైల్ ఫోన్ ని కళ్ళకు సమాంతరంగా ఎత్తి పట్టుకుని చూడండి. టెక్స్ట్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తల కిందకు వాలిపోతుంది. అందుకే టెక్స్ట్ చేసే సమయాన్ని తగ్గించండి.

ఆడవాళ్లు హై హీల్స్ తో జాగ్రత్త:

హై హీల్స్ వేసుకుంటే అందంగా కనిపిస్తారు. కానీ మీ వెన్నెముక ఆరోగ్యం మాత్రం దెబ్బ తింటుంది. కాబట్టి ఎప్పుడో ఒకసారి హై హీల్స్ వేసుకుంటే పర్వాలేదు కానీ అస్తమానం స్టైల్ అంటూ వాటిని వేసుకోవద్దు.

వ్యాయామం:

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరైన వ్యాయామం లేకపోతే వెన్నెముక నిటారుగా నిలబడకుండా బంగిపోతుంది. అందుకే వెన్నెముకను నిటారుగా ఉంచే వ్యాయామాలు చేయండి.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version