ఓట్స్ తో హెల్తీ దోశలు.. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తినేస్తారుగా.!

-

దోశల్లో బోలెడు రకాలు ఉన్నాయి.. మసాల దోశ, ఎగ్ దోశ, ఉల్లిదోశ. ఎప్పుడూ దోశలు అంటే.. పప్పు, బియ్యంతోనేనా.. వెరైటీగా ట్రై చేయాలి కదా. అందులోనూ.. బరువు తగ్గాలనుకునేవారు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. మరి ఈరోజు మనం హెల్తీ అయినా దోశలు ఎలా చేయాలో చూద్దాం. ఇవి డైలీ తిన్నా మీ ఆరోగ్యానికి ఎలాంటి చింతా అక్కర్లేదు. ఓట్స్ కాంబినేషన్ తో బొంబాయిరవ్వ కలిపి దోశలు వేస్తే మంచి పోషకాలు అందుతాయి. ఓట్స్ అంటే.. అందరూ జావగానే వాడతారు.. ఈరోజు మనం ఓట్స్ తో దోశలు వేయడం తెలుసుకుందాం. చిన్నపిల్లలకు ఇలాంటి చేసి పెడితే.. ఎంతో ఇష్టంగా తినేస్తారు.

ఓట్స్ దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

ఓట్స్ పౌడర్ ఒక కప్పు
బొంబాయి రవ్వ ఒక కప్పు
పుల్లపెరుగు ఒకటిన్నర కప్పు
క్యారెట్ తురుము రెండు టేబుల్ స్పూన్స్
జీలకర్ర ఒక టేబుల్ స్పూన్
వంటసోడా కొద్దిగా
మీగడ ఒక టేబుల్ స్పూన్
వేయించిన పచ్చి బఠానీలు రెండు టేబుల్ స్పూన్స్ ( ఆప్షనల్)

తయారు చేసే విధానం..

బౌల్ తీసుకుని అందులో బొంబాయిరవ్వ, ఓట్స్ పొడి, జీలకర్ర, వంటసోడా, పుల్ల పెరుగు వేసి కలపండి. కొంచె వాటర్ కలిపి క్యారెట్ తురుము వేసి 15 నిమిషాలు నాననివ్వండి. ఆ తర్వాత పొయ్యి మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి మీగడ రాసి.. చిన్న చిన్న సైజ్ దోశల్లా వేయండి. చిన్నపిల్లలు చూడ్డానికి ఆకర్షిణీయంగా ఉండే బాగా ఇష్టంగా తింటారు కాబట్టి.. చిన్న చిన్న సైజుల్లోనే వేయండి. వాటిపైన.. రోస్ట్ చేసిన పచ్చిబఠానీలు వేయండి. క్యారెట్ తురుము కూడా వేయండి.

ఒక వైపు కాలిన తర్వాత తిప్పేసి మీగడ రాసి మరోవైపు కూడా కాలనివ్వండి. మెత్తగా దూదిలా ఉంటాయి. రెండు వైపులా బ్రౌన్ కలర్ లోకి వచ్చాక తీసేయడమే. హై ఫైబర్ ఉండే ఓట్స్ తో హెల్తీగా ఉండే దోశలు రెడీ. వీటిని చేయడానికి కూడా పెద్దగా టైం పట్టదు. ఉదయం టిఫెన్ గా, ఈవినింగ్ స్నాక్స్ గా కూడా తినేయొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడితే ఎగపడి తినేస్తారు కూడా.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news