కడుపు సంబంధిత సమస్యలు ఏర్పడడానికి చాలా కారణాలున్నాయి, జీర్ణశయ ప్రేగులలో ఉబ్బరం, వాపు, బిగు మొదలగు కారణాలే కాక, ఆహారాన్ని సరిగ్గా తినకపోవడం కూడా కారణంగా ఉంటుంది. మలబద్దకం, వేగంగా ఆహారం తినడం మొదలగు వాటివల్ల కడుపులో నొప్పి తదితర ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని దూరం చేయడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఆపిల్ వెనిగర్
ఆపిల్ వెనిగర్ జీర్ణాశయంలో ఎంజైములని ఉత్పత్తి చేయడంలో సాయపడుతుంది. అందువల్ల కడుపు సంబంధిత సమస్యల నుండి ఇది మంచి ఉపశమనాన్ని కలుగిస్తుంది. ఒక గ్లాసు నీటిలో టేబుల్ స్పూన్ ఆపిల్ వెనిగర్ కలిపి సేవిస్తే బాగుంటుంది.
హెర్బల్ టీ
హెర్బల్ టీ లో ఔషధ లక్షణాలు ఉంటాయి. అల్లం, పిప్పర్మెంట్ కలిపి ఉంటాయి కాబట్టి యాంటీఆక్సిడెంట్లుగా, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా ఉపయోగపడతాయి. దానివల్ల కడుపులో గ్యాస్ కారణంగా కలిగే ఉబ్బరాన్ని తగ్గించి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
వ్యాయామం
రోజులో కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయాలి. లేదంటే శరీరానికి అందాల్సినవన్నీ సరైన పాళ్ళలో అందవు. ఆ కారణంగా కూడా కడుపు సంబంధ సమస్యలు వస్తుంటాయి. అందుకే ప్రతీరోజూ వ్యాయామం తప్పకుండా చేయాలి. కడుపులో గ్యాస్ సంబంధిత వాటిని దూరం చేసుకోవడానికి వ్యాయామం బాగా పనిచేస్తుంది.
పెరుగు
పెరుగు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీనివల్ల కడుపు సంబంధిత ఇబ్బందులు తలెత్తవు. అన్నంలో గానీ, లస్సీ రూపంలో గానీ మరే రకంగానైనా పెరుగుని ఆహారంలో తీసుకోవచ్చు.
మీరు కడుపు సమస్యలతో బాధపడుతుంటే గనక వీటిని ప్రయత్నించవచ్చు.