ఫాస్ట్‌ ఫుడ్స్‌ను మానలేకపోతున్నారా….ఏం పర్వాలేదు.. తిన్నాక ఇవి ట్రే చేస్తే సెట్‌..!!

-

ఈరోజుల్లో ఫాస్ట్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండటం అందరి వల్ల అయ్యే పని కాదు.. వాటి జోలికి వెళ్లనంత వరకే మన ఆరోగ్యం బాగుంటుంది.. ఒక్కసారి ఆ రుచులకు అలవాటు పడ్డామా.. నాలుక పదే పదే అవే కావాలంటుంది. తెలుసు..అవి తినడం వల్ల జంబు సైజ్‌ అవుతామని, లేని పోని ఆరోగ్య సమస్యలు వస్తాయని..కానీ ఏం చేస్తాం వాసన మైమరిపిస్తే..రుచి రమ్మంటుంది. మీరు ఫాస్ట్ ఫుడ్స్‌, జంక్‌ ఫుడ్స్‌ను ఎంత తిన్నా మీ ఆరోగ్యం పాడవ్వొద్దంటే తిన్న తర్వాత కొన్ని పాటిస్తే చాలు.. ఎలాంటి ప్రమాదం ఉండదు.. ఆ చిట్కాలు ఏంటంటారా..!!

ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత గోరువెచ్చని వేడి నీటిని తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది. వేడి నీరు భారీ ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా అదనపు నూనె శరీరంలో ఉండకుండా చేస్తుంది.

గ్రీన్ టీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో తగినంత యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. మీరు ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ వేయించిన ఆహారాన్ని తిన్న తర్వాత గ్రీన్ టీ తాగితే అప్పుడు ఆరోగ్యానికి ఎటువంటి హాని జరగదు. ఇది ఆయిల్ ఫుడ్ నష్టాన్ని నివారిస్తుంది.

సోంపు, వాము నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి పని చేస్తాయి. హెవీ ఫుడ్ తిన్న తర్వాత సోంపు, వాము నీరు తాగటం జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంకా ఇవి మనల్ని ఫిట్‌గా ఉంచుతాయి కూడా… బరువును తగ్గించడంలోనూ ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అంటే ఫాస్ట్ ఫుడ్ వల్ల వచ్చే ఊబకాయాన్ని కూడా నివారించుకోవచ్చు.

పెరుగు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పెరుగు తినడం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది నూనె ప్రభావాన్ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది. ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత పెరుగులో జీలకర్ర కలిపి తింటే ఇంకా మంచిది.

తృణధాన్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. నూనె ఆహారం తర్వాత తృణధాన్యాలను తినవచ్చు. తృణధాన్యాలు తినడం వల్ల, నూనెతో కూడిన ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది. వాటిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని పెంచకుండా తగ్గిస్తాయి.. కాబట్టి.. వీటిల్లో మీకు నచ్చింది ట్రై చేయండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి..!

Read more RELATED
Recommended to you

Latest news