గర్భిణులు ఆకుకూరలు తింటే లోపల బిడ్డ ఏడుస్తాడట..క్యారెట్‌ తింటే నవ్వుతారట.!! తాజా అధ్యయనం

-

శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక అంశంపై పరిశోధనలు చేసి ఆసక్తికరమైన విషయాలు చెప్తుంటారు. తాజాగా శాస్త్రవేత్తలు గర్భస్థ శిశువలుపై అధ్యయనం చేసి ఇంట్రస్టింగ్‌ విషయాలు చెప్పారు. పుట్టబోయే బిడ్డ గర్భిణులు తినే ఆహారం రుచిని బట్టి స్పందిస్తుందట..గర్భిణులు రుచికరమైన ఆహారం తింటే లోపల బిడ్డ నవ్వుతుందట. అధ్యయనం ఎలా చేశారంటే..

వంద మంది గర్భిణులపై అధ్యయనం చేశారు. వారి 4D అల్ట్రాసౌండ్ స్కాన్‌లను తీసుకున్నారు. వారి తల్లులు తినే ఆహారాన్ని బట్టి వారు ఎలా స్పందిస్తున్నారో పరిశీలించారు. అలా కొన్ని కూరగాయలకు పిల్లలు స్పందించడం చాలా విచిత్రంగా అనిపించింది.

ఆకుకూరలు తిన్నప్పుడు ఏడుపు ముఖం..

తల్లి ఆకుకూరలు తిన్నప్పుడు అల్ట్రా సౌండ్‌లో పిల్లలు ఏడుపు ముఖం పెట్టినట్టు కనిపించింది. అదే క్యారెట్ తిన్నప్పుడు శిశువులు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. UKలోని డర్హామ్ యూనివర్శిటీలోని ఫీటల్, నియోనాటల్ రీసెర్చ్ ల్యాబ్ నేతృత్వంలోని ఈ అధ్యయనం చేశారు. వీరు 100 మంది గర్భిణులకు సంబంధించిన 4D అల్ట్రాసౌండ్ స్కాన్‌లను తీసుకుంది. తల్లులు తినే ఆహారాల నుంచి వారి పుట్టబోయే పిల్లలు ఎలా స్పందిస్తారో చూశారు. వారి పరిశోధనల్లో శిశువుల్లో రుచి, వాసన గ్రాహకాల అభివృద్ధిపై అధ్యయనం సాగింది.

18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల కాబోయే తల్లులను ఎంచుకున్నారు. వారు 32 వారాలు, 36 వారాల గర్భధారణతో ఉన్నవారు. వీరికి స్కాన్ చేయడానికి 20 నిమిషాల ముందు క్యారెట్ లేదా ఆకుకూరలు తినిపించారు. మరింకేమి తినవద్దని తల్లులకు సూచించారు. ఆ ఆహారం పేగు ద్వారా బిడ్డకు చేరాక స్కాన్ తీశారు. అప్పుడు శిశువుల రియాక్షన్లను రికార్డు చేశారు. ఆ గర్భస్థ శిశువులుగా వారు ఎక్కువ ఏ రుచికి గురవుతారో, బయటికి వచ్చాక ఆ రుచులను ఇష్టపడే అవకాశం ఉందని చెబుతున్నారు. గర్భస్థ శిశువులకు భావోద్వేగాలు, ఇష్టయిష్టాలు ఉంటాయని కనిపెట్టారు పరిశోధకులు.

అంటే బిడ్డ పుట్టకముందు నుంచే గర్భస్థ శిశువులు అన్నీ గ్రహించగలుగుతారనమాట.. సాధారణంగా.. నెలలు నిండే కొద్ది బిడ్డ తన్నడం మొదలుపెడతాడని తెలుసు..కానీ ఇలా తినే ఆహారాన్ని బట్టి ముఖం మార్చుతాడని తెలిస్తే భలే క్రేజీగా ఉంది కదూ..!వాళ్లు కడుపులో ఉన్నప్పుడు ఏ రుచికి బాగా ఇష్టపడతారో పుట్టాక అదే వారికి ఫేవరెట్‌ అయిపోతుందట.. !

Read more RELATED
Recommended to you

Latest news