ఈ తప్పులు చెయ్యకుండా ఉంటే గుండెలో మంట రాదు..!

-

చాలా మంది గుండెల్లో మంట తరచూ వస్తూ ఉంటుంది. మీకు కూడా గుండెలో మంట వస్తోందా..? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలి. గుండెల్లో మంట కనుక వచ్చిందంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాకుండా చూసుకోండి.

heart health

సరైన బాడీ వెయిట్ ను మెయింటైన్ చేయండి:

మీరు ఎంత బరువు ఉండొచ్చు అంతే ఉండండి. అంతకంటే ఎక్కువ బరువు ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి. చాలా మంది ఈరోజుల్లో ఊబకాయం తో బాధ పడుతున్నారు. అలాంటి వాళ్ళు ముందు నుండే జాగ్రత్త పడాలి.

స్మోకింగ్ చెయ్యొద్దు:

స్మోకింగ్ చేయడం వల్ల కూడా గుండెల్లో మంట వస్తుంది. కనుక గుండెలో మంట తో బాధపడే వాళ్ళు స్మోకింగ్ కి దూరంగా ఉండండి.

వ్యాయామం:

వ్యాయామం ఆరోగ్యానికి చాలా మంచిది. కనీసం ప్రతి రోజూ అర గంట పాటు వ్యాయామం చేస్తే సమస్యలు తగ్గిపోతాయి. గుండెలో మంట కూడా రాదు.

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోండి:

గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా గుండె లో మంట తగ్గుతుంది. కూరగాయలు, చేప, పౌల్ట్రీ మొదలైనవి తీసుకోండి. ఇలా మీరు ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అదే విధంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news