‘స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్’ అన్న కొటేషన్ మనకు సినిమా థియేటర్స్, పబ్లిక్ ప్లేసెస్‌లో చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటుంది. బహిరంగంగా ధూమపానం, మద్యపానం చేయొద్దని పెద్దలూ చెప్తుంటారు. కానీ, కొంత మంది మాత్రం ఇంకా ధూమపానానికి బానిస అవుతున్నారు. యువత సైతం ఈ చెడు అలవాటు వైపునకు మొగ్గు చూపుతున్నది. చాలా మంది పొద్దున్నే అనగా పరగడుపున సిగరెట్స్ తాగుతుండటం మనం గమనించొచ్చు. పరగడుపున సిగరెట్ తాగితేనే తమ డే మొత్తం బాగుంటుందని వారు భావిస్తుంటారు.
కానీ, ఇలా చేయడం చాలా డేంజర్ అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరగడుపున సిగరెట్స్ తాగితే కేన్సర్ వచ్చే చాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రకాల కేన్సర్స్ వస్తాయట. దాంతో పాటు మార్నింగ్ లేవగానే సిగరెట్స్ తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతింటాయని వివరిస్తున్నారు. మూత్రపిండాల పని తీరు క్రమంగా క్షీణించడంతో పాటు అవి పూర్తిగా దెబ్బతినే చాన్సెస్ ఉంటాయి. చాలా మంది మార్నింగ్ టైమ్స్‌లో బ్రేక్ ఫాస్ట్ కూడా తీసుకోరు.
బ్రేక్ ఫాస్ట్ వదిలేసి డైరెక్ట్‌గా లంచ్ చేసేస్తుంటారు. అయితే, అలా చేయడం మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపల్సరీగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడంతో పాటు లంచ్ టైమ్‌కు తీసుకుంటేనే హెల్త్ బాగుంటుందని పేర్కొన్నారు. బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేసినా ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇకపోతే ధూమపానం చేయొద్దని ప్రభుత్వం ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ చాలా మంది బహిరంగంగానే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిమానాలు విధించడంతో పాటు వారికి ధూమపానం వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.