నువ్వుల నూనెను ఇలా సీజన్‌ను బట్టి వాడితేనే మంచిదట..! లేకుంటే..

-

ఆరోగ్యానికి మేలు చేసేవి కూడా అతిగా వాడితే విషంగానే మారతాయి. బాడీలో ఎలాంటి నొప్పులు ఉన్నా నువ్వుల నూనెను కాస్త వేడి మద్దనా చేసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. ఇంకా ఈ నూనెతో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ నూనెను వంటల్లో కూడా వాడుకోవచ్చు…కానీ అన్ని సీజన్స్‌లో ఈ నూనెను వాడుకోవద్దంటున్నారు నిపుణులు. మరీ ఏ సీజన్‌లో నూనెను వాడొచచ్చు.. అసలు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి..ఇలాంటి వివరాలన్నీ మీకోసం..!

ఎప్పుడు ఉపయోగించాలంటే..

సెప్టెంబరు నుంచి వాతావరణంలో మార్పులు కూడా వస్తుంటాయి. అంటే చలికాలం ఆరంభం కాబోతుంది. అందుకే పరిమిత పరిమాణంలో నువ్వుల నూనెను ఉపయోగించుకోవచ్చు… అక్టోబరులో ఆ పరిమాణం కాస్త పెంచి, ఇలా డిసెంబర్ వరకు ఎక్కువగా వాడుకోవచ్చు. అయితే, డిసెంబర్ తర్వాత, దాని వినియోగాన్ని క్రమంగా తగ్గించాలి.. ఫిబ్రవరి నాటికి, ఈ నూనె వేడి శరీరం లోపల చల్లబడటం ప్రారంభమవుతుంది. మార్చి-ఏప్రిల్‌లో ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి, తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. నువ్వుల నూనెను ఇలా వాడుకున్నప్పుడే ఎలాంటి ఇబ్బందులు రావు. ఇలా వాడుకోవడం ద్వారా శరీరం చలికాలం నుంచి తనను తాను రక్షించుకోవడానికి సిద్ధమవుతుందట.

నువ్వుల నూనె ఉపయోగాలు..

భాస్వరంకు ఇది మంచి మూలం.
విటమిన్ డి, ఇ, కె కలిగి ఉంటుంది.
నువ్వుల నూనెకు వాత, కఫాలను నియంత్రించే శక్తి ఉంది.
దీని వినియోగం వల్ల దగ్గు, శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులు దరిచేరవు.
జలుబు కారణంగా వచ్చే వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
నువ్వుల నూనెను చర్మంపై అప్లై చేయడం వల్ల గ్లో పెరుగుతుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

నువ్వుల నూనెను నెయ్యిలా కూడా వాడుకోవచ్చు. వీటితో పూరీలు, పరాటాలు కూడా చేసుకుంటారు. అన్ని రకాల వంటల్లో ఈ ఆయిల్‌ను వాడుకోవచ్చు. అయితే పైన చెప్పినట్లు సీజన్‌కు తగ్గట్టు వాడుకోవాలి. సమ్మర్‌లో తక్కువగా వాడాలి. బయట వేడిగా ఉంటుంది. మీరు ఈ నూనెను కూడా ఎక్కువగా వాడితే బాడీ బాగా హీట్‌ అవుతుంది. కాబట్టి సమ్మర్‌లో ఈ ఆయిల్‌ వాడకం తగ్గించాలని నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news