ప్రజలు బయటకు రావొద్దు…అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్ ఇచ్చింది. ఏపీలో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9.08 లక్షల క్యూసెక్కులకు నీరు చేరింది.
కాసేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారిచేసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసిన విపత్తుల సంస్థ… వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరారు. పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, ప్రయాణం లాంటివి చేయరాదని తెలిపింది డా.బి.ఆర్ అంబేద్కర్, ఎండి, విపత్తుల సంస్థ.