కరోనా: ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందా? ఇలా చేయండి!

కరోనా నేపథ్యంలో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువ అయ్యాయి. అవి ప్రాణాంతకంగా మారుతున్నాయి కూడా. ఈ కారణంగానే ఆక్సిజన్‌ సిలిండర్‌ కొరత కూడా ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతో కూడా శ్వాస సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం చక్కెరకు బదులు బెల్లాన్ని ఆహార పదార్థాల్లో వాడతారు. అందువల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎందుకంటే చక్కెర కంటే బెల్లం మంచిదని అందరికీ తెలుసు! బెల్లం సహజమైన తీపి పదార్థం. బెల్లంలో నల్ల బెల్లమైతే ఇంకా మంచిది. దగ్గుతో బాధపడేవారు కూడా బెల్లం, తేనె కాంబినేషన్‌ తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.అంతేకాదు వేడి చేసిన బెల్లం, నెయ్యిని ప్రతి రోజూ రాత్రిపూట నిద్రపోయే ముందు తీసుకుంటే ఇన్ఫెక్షన్లను నయం అవుతాయి.

 

మీకు గొంతు నొప్పి, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ వంటివి ఇట్టే పోతాయి. సాధారణంగా చాలా మంది అల్లం, నెయ్యి కలిపి లడ్డూలు చేసుకొని రోజూ తింటూ ఉంటారు. బెల్లం, నెయ్యీ కలిపి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. బెల్లం ఎక్కువ తింటే వేడి చేస్తుంది. కాబట్టి తగిన పరిమాణంలో తీసుకోవాలి. బెల్లం, నెయ్యితో తిన్న తర్వాతి రోజు మీకు వేడి చేసినట్లు అనిపిస్తేం అప్పుడు బెల్లం వాడకం కాస్త తగ్గించుకోవాలి
గ్యాస్ట్రిక్‌ సమస్య ఉంటే భోజనం చేశాక కొద్దిగా బెల్లం తినండి.