ఫస్ట్‌ టైమ్‌ జిమ్‌లో జాయిన్‌ అవుతున్నారా..? అయితే ఈ విషయాలు మీకోసమే..!

-

ఆరోగ్యంగా ఉండాలని అందరూ అనుకుంటారు.. కానీ కొందరు మాత్రమే ఆ ట్రాక్‌లో ఉంటారు. బిజీబిజీ లైఫ్‌లో…బొజ్జు కాస్త ఎక్కువైనా తప్పక భరించాల్సిందేనా..ఫిట్‌నెస్‌ మీద శ్రద్ధపెడితే..ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అయితే ఫిట్‌గా ఉండాలని అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ జిమ్‌ బాట పడుతన్నారు. అక్కడ అసలు ఏం చేస్తారో కానీ.. ఫోటోలు, వీడియోలు తీసుకుని సోషల్‌ మీడియాలో స్టోరీస్‌ మాత్రం పక్కా పెడతారు కొందరు. జిమ్‌లో ఎంత సేపు వర్కౌట్స్‌ చేయాలి, మొదటిసారి జిమ్‌లో జాయిన్‌ అయ్యేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

జిమ్‌లో ఎంత సేపు వర్కౌట్స్‌ చేయాలి..?

సాధారణంగా ప్రతి రోజూ వ్యాయామం యొక్క సమయం 1 నుండి ఒకటిన్నర గంటల వరకూ ఉండాలట. అయితే కొన్ని కఠినమైన వ్యాయామాలు ఎక్కువ సేపు చేయలేం.. చేసే వ్యాయామం బట్టి టైమ్‌ డిసైడ్‌ అవుతుంది. తేలికపాటి వ్యాయామం చేసే వ్యక్తులు, తీవ్రమైన వ్యాయామం కంటే ఎక్కువసేపు పని చేస్తారు. కొన్నిసార్లు వ్యాయామం… చేసే సమయం, వయస్సు, వైద్య పరిస్థితి, ఫిట్‌నెస్‌పై కూడా ఆధారపడి ఉంటుందట. అందరూ సేమ్‌ టైమ్‌ చేయాలని రూల్‌ ఏం ఉండదు. మీరు జిమ్‌కు వెళ్తుంటే.. ఎదుటివారిని చూసి మీరు కూడా అలా చేయాలని సొంతంగా ఏదీ ప్రయత్నించవద్దు.

జిమ్‌లో ఈ తప్పులు చేయొద్దు..

జిమ్‌లో ట్రైనర్‌ గైడ్‌ లేకుండా ఏం చేయకూడదని నిపుణులు అంటున్నారు. జిమ్ చేయడానికి సరైన మార్గాన్ని సరైన కదలికలను గురించి ట్రైనర్‌ చెప్తారు. తెలియకుండా జిమ్‌లో ఎప్పుడూ వర్కవుట్ చేయకూడదు. ఇలా చేసే వారికి లాభానికి బదులు నష్టమే ఎక్కువ జరుగుతుంది. కొన్నిసార్లు ఇది కండరాల గాయాలు ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది. ఇంట్లో వ్యాయామం చేసే వారు రన్నింగ్, స్ట్రెచింగ్ చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో రన్నింగ్. స్ట్రెచింగ్‌లను భాగం చేసుకోవడం మంచిది. జిమ్‌లో చేరేటప్పుడు, మీరు ఫిట్‌నెస్ ట్రైనర్ నుండి పూర్తి సమాచారాన్ని తీసుకోవాలి. మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే, మీరు దాని గురించి ముందుగానే ట్రైనర్‌కు ముందే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news