రోజూ రాత్రి దీన్ని తాగితే చాలు.. ఉదయానికే మీ పొట్టంతా కరిగిపోతుంది..

-

ఉబకాయం అనేది ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది..అలాంటి వారికోసమే ఈ జ్యూస్..మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అలాగే ఈ జ్యూస్ ను తాగడం వల్ల అధిక పొట్ట సమస్య కూడా తగ్గుతుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ జ్యూస్ ను ఎలా తయారు చేస్తారు.. జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ జ్యూస్ మన శరీరంలో మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గేలా చేయడంలో సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది అధిక బరువు, అధిక పొట్ట వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లే ఈ సమస్య బారిన పడడానికి ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు, అధిక పొట్ట వల్ల గుండె సమస్యలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అనేక రకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.ఈ జ్యూస్ ను తయారు చేసుకోవడానికి గానూ మనం ఒక కీరదోసకాయను, ఒక ఇంచు అల్లం ముక్కను, ఒక నిమ్మకాయను, కొద్దిగా కొత్తిమీరను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసుకుని జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో అల్లం ముక్కలను, అలాగే కొత్తిమీరను కాడలతో సహా కట్ చేసుకుని వేసుకోవాలి. తరువాత అర గ్లాస్ నీళ్లు పోసి జ్యూస్ లాగా మెత్తగా చేసుకోవాలి..

ఇప్పుడు ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో నిమ్మరసం వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ ను రాత్రి పడుకోవడానికి అరగంట ముందు తాగాలి. ఈ విధంగా ఈ జ్యూస్ ను తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను చాలా సులభంగా కరిగించుకోవచ్చు. అలాగే అధిక పొట్ట సమస్య కూడా తగ్గుతుంది. ఈ జ్యూస్ ను తాగిన 15 రోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పును మనం గమనించవచ్చు. ఈ విధంగా ఈ జ్యూస్ ను క్రమం తప్పకుండా నెలరోజుల పాటు తీసుకోవాలి. అధిక బరువు, అధిక పొట్ట వంటి సమస్యలతో బాధపడే వారు ఈ చిట్కాను వాడడం వల్ల చక్కటి ఫలితాలను మీ సొంతం చేసుకోవచ్చు…

Read more RELATED
Recommended to you

Latest news