చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించండలో లెమన్‌ గ్రాస్‌ నెంబర్‌ వన్‌..!

-

కొలెస్ట్రాల్‌ అనేది మనిషికి కోపం లాంటిది.. అదే ఉండాల్సినంత ఉంటే సరే.. మరీ ఎక్కవుగా కోపం ఉంటే.. మనకు డేంజర్‌.. మరీ ఎక్కువ బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ ఉంటే.. గుండెకు డేంజర్‌.. ఇతరులు చేసే పనుల వల్ల మనకు తిక్కలేసి కోపం వస్తుంది.. మనం తినే జంక్‌ ఫుడ్‌ వల్ల కాలేయానికి తిక్కలేసి విచ్చలవిడిగా ఈ కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బాడీలో ఎక్కువైతే..బ్లడ్ సర్కులేషన్‌కు అడ్డుపడుతుంది. దీన్ని కరిగించాలి.. కరిగించాలంటే..ఏం చేయాలి..? మంచి జీవనశైలి పాటించాలి, బాడీకి చెమటపట్టించాలి.. ఇవన్నీ మాతోని అయ్యే పనులు కాదంటరా..? అయితే కొన్ని చిట్కాల ద్వారా కూడా ఈ చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించవచ్చు. అందులో ఒకటి.. లెమన్‌ గ్రాస్.. ఇది ఎలా కొవ్వును నియంత్రిస్తుంది, ఎలా వాడాలో చూద్దాం.!

లెమన్ గ్రాస్ కొలెస్ట్రాల్‌ను ఎలా నియంత్రిస్తుందంటే

నిమ్మగడ్డి అనేది ఆసియాలోని కొన్ని దేశాలలో కనిపించే గడ్డి. ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉన్న ఈ గడ్డి అనేక వ్యాధుల చికిత్సలో వాడతారు. ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక వ్యాధులను పరిష్కరించటంలో ఉపయోగపడతాయి. నిమ్మరసం ఎలా అయితే కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుందో.. లెమన్‌ గ్రాస్‌ కూడా అలాగే కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అధిక కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల మీ గుండె ప్రమాదంలో డేంజర్‌ జోన్‌లో ఉంటుంది. నిమ్మరసం తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. 2007 పరిశోధన ప్రకారం, లెమన్‌గ్రాస్ ఆయిల్‌ను 14 రోజుల పాటు ఎలుకలకు ఇవ్వటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గిందని తెలిపారు.

ఎలా ఉపయోగించాలి?

నిమ్మ గడ్డితో టీ చేసుకుని తాగొచ్చు. లెమన్ గ్రాస్ టీని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రోజంతా కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. దీనిని తీసుకోవడం ద్వారా అనేక సీజనల్ వ్యాధులు కూడా నయం అవుతాయి. జలుబు, దగ్గును తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మీరు సూప్‌లు, సలాడ్‌లలో కూడా నిమ్మ గడ్డిని వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news