ఒకేసారి ఎక్కువ మంది పిల్లలకి ఐవీఎఫ్ పద్దతి ద్వారా జన్మనివ్వద్దు..!

-

పిల్లల పుట్టలేనివారు ఐవిఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఇలా ఇంఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తో ఒకటి కంటే ఎక్కువ మంది శిశువులకు జన్మనివ్వడం వల్ల సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తో ఒకరి కంటే ఎక్కువమంది బిడ్డలకి జన్మనివ్వడం వల్ల తల్లికి మరియు బిడ్డకి ప్రమాదమే అని అంటున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒకటి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వడం మంచిది కాదని ఈ విషయాన్ని గమనించాలి అని చెబుతున్నారు. దీని కారణంగా సీరియస్ కాంప్లికేషన్స్ తల్లి మరియు బిడ్డకి కూడా వస్తాయని అంటున్నారు.

pregnent women

మల్టిపుల్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్:

బ్యాక్ పెయిన్, వాజినాల్ డిశ్చార్జ్, ప్లాసెంటా సమస్యలు, ప్రీ టర్మ్ బర్త్, ఒత్తిడి, హైపర్టెన్షన్ మొదలైనవి.
అదే విధంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు, గుండె సమస్యలు, మిస్ క్యారేజ్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి ఈ విషయాలు తెలుసుకోవాలి:

చాలా ఎంబ్రియాస్ నుండి ఒక దానిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని యూట్రస్ లోకి పంపిస్తారు. దీనితో ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇలా సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుండి బయట పడవచ్చు. అయితే ఇలా చేయడం అనేది పూర్తిగా సురక్షితం. మంచిగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని నిపుణులు చెప్తున్నారు. పైగా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంది అని కూడా నిపుణులు చెబుతున్నారు.

ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కరోనా సమయంలో పిల్లల్ని కనాలి అనుకునే కపుల్స్ కి కొన్ని ముఖ్యమైన విషయాలు:

కరోనాని తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి.
మీరు ఎగ్ కలెక్షన్ తర్వాత కరోనా టెస్ట్ చేయించుకోండి అప్పుడు కనుక పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ ని కొన్ని రోజులు ఆపి.. రికవరీ అయిన తర్వాత ట్రీట్మెంట్ ని మళ్ళీ కొనసాగించండి లేదంటే ఇబ్బందులు వస్తాయి.
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా టెలిఫోన్ ద్వారా
కన్సల్ట్ చేయండి.
అలానే కచ్చితంగా మీరు వాక్సిన్ వేయించుకోండి. ఇలాఈ విధమైన జాగ్రత్తలు పాటించడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news