వేసవిలో వేడిని తట్టుకునేందుకు తప్పక వీటిని తీసుకోండి..!

-

వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి వేడి కారణంగా వడదెబ్బ మొదలైన సమస్యలు కలుగుతాయి. ఇలాంటి సమస్యలేమీ రాకుండా ఆరోగ్యంగా ఎండ వేడి ని తట్టుకోవాలంటే ఈ డ్రింక్స్ ని తీసుకోండి. ఇవి మీ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి అలానే ఎండ వేడిని తట్టుకునేలా చేస్తాయి.

- Advertisement -

ఆమ్ పన్నా:

దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది పైగా ఎండ వేడి తట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎనర్జీని కూడా ఇస్తుంది. మామిడికాయ జీలకర్ర బ్లాక్ సాల్ట్ పంచదార పుదీనా వంటివి వేసి దీనిని తయారు చేసుకోవచ్చు.

బట్టర్ మిల్క్:

బటర్ మిల్క్ కూడా మిమ్మల్ని ఎంతో రిఫ్రెష్ గా మారుస్తుంది మీరు ఇందులో కొత్తిమీర జీలకర్ర పొడి వేసుకొని తీసుకోవచ్చు. జీర్ణ సమస్యలు కూడా ఉండవు. వేడిని తట్టుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. నీరసం వంటి సమస్యలు రాకుండా కూడా ఇది చూస్తుంది.

బార్లీ నీళ్లు:

బార్లీ నీళ్లు కూడా ఎండాకాలంలో బాగా హెల్ప్ అవుతాయి దీనిని మీరు తీసుకుని ఆరోగ్యంగా ఉండొచ్చు. ఎండ వేడిని తట్టుకోవచ్చు. ఉప్పు నిమ్మరసంని కూడా మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు.

జల్జీరా:

జల్జీరా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది జీలకర్ర వేయించి పొడి చేసుకోని నీళ్లలో కలుపుకొని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు ఉండవు అలానే ఇందులో మీరు నల్ల ఉప్పు వేసుకోవచ్చు.

కొబ్బరినీళ్లు:

కొబ్బరి నీళ్లు కూడా మీకు ఆరోగ్యానికి మంచి చేస్తాయి. నీళ్లు తాగడం వలన ఎటువంటి నష్టం కలగదు. వేసవిలోని తీసుకుంటే నీరసం వంటి సమస్యలు మీ దరిచేరకుండా ఉంటాయి.

లస్సీ:

లస్సీ ని కూడా మీరు తీసుకోవచ్చు. కావాలంటే మీరు మామిడిపండు అరటిపండు వంటివి యాడ్ చేసుకోవచ్చు.

నిమ్మకాయ నీళ్లు:

నిమ్మరసంలో నీళ్లు ఉప్పు పంచదార పంటివే వేసుకుని మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎండాకాలంలో రిఫ్రెష్ గా మీరు ఉంటారు. అలానే పుచ్చకాయ జ్యూస్ చెరుకు రసం మామిడికాయ జ్యూస్ వంటివి కూడా మీరు ఎండాకాలంలో తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...