ఆవాలు వల్ల మనకి కలిగే లాభాలు ఎన్నో తెలుసా…?

-

మామూలుగా ఆవాలని అన్నిటిలోనూ ఉపయోగిస్తూనే ఉంటాం. దీని పరిణామం చాలా చిన్నగా ఉన్న ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. దీనిలో ఆయుర్వేద విలువలు కూడా ఉంటాయి. ఎన్నో రోగాల నుంచి ఇది మనల్ని రక్షిస్తుంది. ఆవాలలో పోషక విలువల తో పాటు ఔషధగుణాలు కూడా ఉంటాయి. ఐరన్, జింక్, మాంగనీస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్ధాలు కూడా దీనిలో ఉంటాయి. ప్రతి 100 గ్రాముల ఆవాల లో 9 నుంచి 82 గ్రాములు టోకోఫెరాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ‘విటమిన్ ఈ’ కి సమానం.

శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆవ నూనెను కనుక వంటల్లో ఉపయోగిస్తే చాలా ప్రయోజనాలు కలుగుతాయి అని వైద్యులు అంటున్నారు. పంటి నొప్పి ఉంటే గోరు వెచ్చటి నీటి లో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే పంటి నొప్పి తగ్గిపోతుంది. ఉబ్బసం వ్యాధి ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చక్కెర తో కలిపి తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది అంటే ఆవాల పొడి తో జుట్టు ని క్లీన్ చేసుకుంటే జుట్టు రాలడం పూర్తిగా తగ్గుతుంది.

తేనె తో పాటు ఆవాల పొడిని తీసుకుంటే శ్వాసకోస సమస్యలు కి చెక్ చెప్పొచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఆవాల ముద్ద, కర్పూరం కలిపి మీకు నొప్పిగా ఉన్న ప్రాంతాల్లో రాస్తే ఉపశమనం లభిస్తుంది. ఆవాలలో సెలీనియం అనే రసాయనం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాల్ని ఇస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం కూడా దీనిలో ఉంది. ఆవాలు వలన ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని ఊహించలేదు కదా..! ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగించండి. దీనితో ఈ సమస్యలన్నింటినీ సులువుగా పరిష్కరించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news