ఈ వస్తువులని రిఫ్రిజిరేటర్లో ఉంచుతున్నారా? ఐతే ఇప్పుడే వాటిని తీసేయండి.

రిఫ్రిజిరేటర్ ఉంది కదా అని ప్రతీదీ అందులో దాచాలనుకోవడం పొరపాటే. దీనిలో ఉంచడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్న మాట నిజమే కానీ, రిఫ్రిజిరేటర్లో ఉంచకూడని వస్తువులు కూడా ఉంటాయని మీకు తెలుసా? కిచెన్లో సామాగ్రిలోని అన్ని వస్తువులు రిఫ్రిజిరేటర్లో ఉంచాలను అనుకోవద్దు. రిఫ్రిజిరేటర్ కి కూడా కొన్ని హద్దులున్నాయి. అది అన్నింటినీ తాజాగా ఉంచుతుందని అనుకోవద్దు. కొన్నింటిని పాడు చేస్తుంది కూడా. అవేంటో ఇక్కడ చూద్దాం.

మూత లేని ఆహారాలు

ఆహారాల మీద మూత లేకుండా ఫ్రిజ్ లో ఉంచవద్దు. దానివల్ల రిఫ్రిజిరేటర్లోని చల్లదనం ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు అది తినడానికి పనికిరాకుండా పోయే అవకాశమూ ఉంటుంది. అందుకే అన్ని ఆహారాలను మూత లేకుండా ఫ్రిజ్ లో ఉంచకూడదు.

వండిన చికెన్

వండిన చికెన్ ని రేపు కూడా వస్తుంది కదా అని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు. రేపటి వరకూ అయితే ఫర్వాలేదు గానీ, మూడు రోజులకి మించి ఫ్రిజ్ లో ఉంచడం మాత్రం సరికాదు. దానివల్ల ఉష్ణోగ్రతలో తేడాల వల్ల చికెన్ పై ఫంగస్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

గుడ్లు

ప్రతీ రిఫ్రిజిరేటలో తలుపు వైపు గుడ్లు పెట్టుకోవడానికి ఒక పరికరాన్ని ఇస్తారు. కానీ మీకి ది తెలుసా? గుడ్లని అక్కడ ఉంచకూడదు. ఊరికే ఫ్రిజ్ తలుపు తీస్తూ ఉండడం వల్ల ఉష్ణోగ్రతలో మార్పుకు గుడ్లు ప్రభావితం అవుతాయి. దానివల్ల రసాయన చర్య జరిగి గుడ్లు తొందరగా పాడయ్యే అవకాశం ఉంది.

ఇంకా బేకింగ్ సోడా, తాజా కొత్తిమీర, మెంతికూర, కరివేపాకు మొదలగునవు ఫ్రిజ్ లో పెట్టవద్దు. బేకింగ్ సోడాని 30రోజుల కంటే ఎక్కువ ఉంచితే రిఫ్రిజిరేటర్లోని ఇతర వస్తువుల వాసనని పోగొడుతుంది. కొత్తిమీర మెంతికూరలని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల సమస్య లేదు కానీ, తాజాగా ఉన్న వాటి ఆకులు నల్లగా మారతాయి.