నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్.. మద్యం తాగకుంటే వచ్చే వ్యాధి..!

-

మన శరీరంలో ఉన్న అవయువాలకు హోదా కల్పిస్తూ.. గ్రేడింగ్‌ ఇస్తే..కాలేయం ముందు ఉంటుంది. ఉన్నవాటిల్లో కాలేయం మాత్రమే 500లకు పైనా విధులు నిర్వహిస్తుంది. ఇది పాడైతే మనిషి జీవితం దెబ్బతిన్నట్లే..! శరీర అవసరాన్ని బట్టి పోషకాలను వివిధ అవయవాలకు రవాణ చేయడానికి కాలేయమే ముఖ్య బాధ్యత వహిస్తుంది. అలాంటి లివర్‌కు కొవ్వుపడితే ఏ పని చేయదు..కాదు కాదు..చేయలేదు..! కొవ్వు కాలేయ వ్యాధి ఎలా వస్తుంది..? లక్షణాలు ఏంటో ఈరోజు చూద్దాం..

కొవ్వు కాలేయ వ్యాధి అనేది కాలేయంలో అధిక మొత్తంలో కొవ్వు పేరుకుపోయే ఒక సాధారణ పరిస్థితి. ఆరోగ్యకరమైన కాలేయంలో నిర్దిష్ట స్థాయిలో కొవ్వు ఉంటుంది, కానీ ఈ మొత్తం కాలేయ బరువులో 5-10% మించి ఉంటే.. అది సమస్యగా మారుతుంది. 7 నుండి 30 శాతం మంది వ్యక్తులలో కాలక్రమేణా ఫ్యాటీ లివర్ లక్షణాలు తీవ్రమవుతాయని గణాంకాలు అంటున్నాయి..

ఈ లక్షణాలలో కాలేయం వాపు, తరచుగా వాంతులు, ఆకలి లేకపోవడం, ఆహారం బాగా జీర్ణం కాకపోవడం, తరచుగా అలసిపోవడం, బలహీనంగా అనిపించడం, బరువు తగ్గడం, పొత్తికడుపు పైభాగంలో వాపు వంటివి ఉంటాయి. ఫ్యాటీ లివర్‌కు కొన్ని లక్షణాలు.. చేతులు , కాళ్ళపై కూడా కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ లక్షణాలు చేతులు, కాళ్లపై కూడా ఎలా కనిపిస్తాయంటే..

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్: మద్యం తాగితేనే కాదు..తాగకున్నా..కొన్ని సమస్యలు వస్తాయి. అందులో ఇదీ ఒకటి..ఆల్కహాల్ తక్కువగా లేదా అస్సలు తీసుకోని వ్యక్తులను సూచిస్తుంది. ఈ మద్యపానం చేయని వ్యక్తుల కాలేయంలో మరింత కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇందులో కాలేయ కణాల్లో పెద్ద మొత్తంలో కొవ్వు పేరుకుంటుంది..చాలా సందర్భాలలో పరిస్థితి తీవ్రమయ్యే వరకు ఈ వ్యాధి లక్షణాలు కనిపించవు. చేతులు, కాళ్ళపై దురదలు ఫ్యాటీ లివర్‌కి సంకేతం. ఈ దురద సమస్య సాయంత్రం, రాత్రి సమయంలో ఎక్కువగా ఉంటుంట. చేతులు, అరికాళ్ళపై దురదలు ఫ్యాటీ లివర్ వ్యాధికి సంకేతం.

ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని అందుకు తగ్గ చికిత్స మొదలుపెట్టుకోవడం ఉత్తమం. లివర్ విషయంలో అశ్రద్దగా ఉండటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news