మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం, జీవన విధానంతో పాటు మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం. ఎంతో మందికి రాత్రిపూట సరిగా నిద్ర పట్టదు. అయితే ప్రతీ ఒక్కరికి కూడా మంచి నాణ్యమైన నిద్ర ఉండాలి. ఎందుకంటే ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. అదే విధంగా ప్రశాంతంగా ఉంచుతుంది. అయితే రాత్రిపూట కనుక మీరు సరిగ్గా నిద్ర పోలేక పోతుంటే ఈ టిప్స్ ని ఫాలో అవడం మంచిది. మరి ఇక ఆలస్యం ఎందుకు వాటికోసం ఇప్పుడే చూద్దాం.
ఇర్ రెగ్యులర్ వర్క్ టైమింగ్స్:
మీరు చేసే పని సమయం ఇర్ రెగ్యులర్ గా ఉంటే మీ యొక్క నిద్రపై ఎఫెక్ట్ చూపిస్తుంది. దీనితో ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పనివేళలు సరిగ్గా ఉండేటట్లు చూసుకోండి.
ఖాళీ కడుపుతో నిద్రపోవడం:
రాత్రిపూట నిద్ర పోయేటప్పుడు ఖాళీ కడుపుతో నిద్రపోవడం వల్ల కూడా నిద్ర సమస్యలు వస్తాయి. సగం వరకు కడుపు నిండుగా ఉంటే మంచి నాణ్యమైన నిద్ర పొందొచ్చు. బాగా ఎక్కువ తిన్నా సరే సమస్యలు వస్తాయి.
నిద్రపోయే ముందు స్క్రీన్ కి దూరంగా ఉండండి:
నిద్రపోయే ముందు టీవీ, మొబైల్ ఫోన్స్ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. కనీసం నిద్రపోవడానికి అరగంట ముందు వీటిని క్లోజ్ చేసి అప్పుడు మాత్రమే నిద్రపోండి.
సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకోవద్దు:
రాత్రిపూట సిట్రస్ ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. అలాగే కడుపులో యాసిడ్ చేరిపోతుంది. కాబట్టి వీటిని తీసుకోకండి. ఇలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మంచి నిద్రను పొందడానికి అవుతుంది దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు.