బంగాళ‌దుంప తింటున్నారా… అయితే ఈ ర‌హ‌స్యాలు తెలుసుకోండి..!

-

స‌హ‌జంగా బంగాళదుంపతో రుచికరమైన వంటలు, కూరలు, చట్నీలు ఇలా అనేక ర‌కాల వంట‌లు త‌యారు చేస్తుంటారు. ఆహార పౌష్టికత పరంగా బంగాళ దుంపలో పిండి పదార్ధాలు ప్రధానమైన ఆహార పదార్ధం. ప్రపంచంలో చాలా మందికి ఇష్టమైన ఆహారాలలో బంగాళ‌దుంప ఒకటి. బంగాళ దుంపలో పలు విధాలైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉన్నాయి. పొటాషియం, విటమిన్-B6 మ‌రియు విట‌మిన్ సి బంగాళదుంప‌లో పుష్క‌లంగా ఉన్నాయి.

Potatoes Health Benefits, Risks and Nutrition Facts
Potatoes Health Benefits, Risks and Nutrition Facts

బంగాళ‌దుంప ర‌సం తాగ‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించటానికి సులభంగా స‌హాయ‌ప‌డుతుంది. బంగాళాదుంప తినేందుకు రుచిగా ఉండటమే కాదు, అందానికి అడ్డుగా నిలిచే అనేక చ‌ర్మ‌ సమస్యల్ని త‌గ్గిస్తుంది. కళ్ల నుంచి జుట్టు వరకు అందాన్ని పెంపొందించడంలో ముందుటుంది. గుండె వ్యాధులు మరియు స్ట్రోక్స్ తగ్గించటానికి మరియు నిరోధించటానికి బంగాళాదుంప ఎంత‌గానూ స‌హాయ‌ప‌డుతుంది.

అలాగే మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పదార్ధాలు కూడా బంగాళ‌దుంప‌లో లభిస్తాయి. ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి మరియు అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది. క్యాన్సర్ తో బాధపడే వారు కూడా బంగాళ‌దుంప జూస్ తాగ‌డం వ‌ల్ల వీటిలో ఉండే యాంటీ క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా నివారిస్తుంది. బంగాళాదుంపరసంతో రెగ్యులర్ గా జుట్టుకు మాస్క్ వేసుకుంటే జుట్టు ఒత్తుగా మ‌రియు బ‌లంగా ఉండ‌డానికి తోడ్పడుతుంది.

అలాగే బంగాళ‌దుంపలో ఉండే పిండిపదార్థాలు మానవుడి మెదడు ఎదుగుదలకు చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. మధుమేహం, కిడ్నీ వ్యాధులు, కాలేయ వ్యాధి, రక్తపోటు మరియు అనేక ర‌కాల జ‌బ్బులను త‌గ్గించ‌డంలో బంగాళ‌దుంప చేసే మేలు అంతా ఇంతా కాదు. త‌లనొప్పి ఉప‌శ‌మ‌నానికి బంగాళ‌దుంప మంచి రెమిడీగా ప‌ని చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news