క్యాన్సర్ కేసుల పెరుగుదల పై షాకింగ్ విషయాలను బయటపెట్టిన పరిశోధకులు..

-

క్యాన్సర్ ప్రాణానతకమైన వ్యాధి.. ఒకప్పుడు వృద్దుల్లో మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి వస్తుంది.ఈ మధ్య కాలంలో యువకుల్లో కూడా ఈ వ్యాధి వస్తుంది. ఇటీవల బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం.. 50 ఏళ్లలోపు వారికి క్యాన్సర్ ముప్పు నిరంతరం పెరుగుతోంది. 1970 లో పుట్టిన వారితో పోలిస్తే 1990 తర్వాత పుట్టిన వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.. ఇది అనేక పరిశోధలతో నిజమని తేలింది..

 

సాధారణంగా గుట్కా, ధూమపానం, మద్యం, కాలుష్యం వంటివి క్యాన్సర్‌కు కారణమని భావిస్తుంటారు. అయితే పరిశోధనల ప్రకారం.. చిన్ననాటి నుండి ఇప్పటి వరకు మీ జీవనశైలి కూడా క్యాన్సర్‌కు కారణమని తేలింది. క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు ఆహారం, జీవనశైలి, పర్యావరణం, మన కడుపులో నివసించే పురుగులు (మైక్రోబయోమ్). ఊబకాయం కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణం. పోషకాహార లోపం కూడా క్యాన్సర్‌కు ప్రధాన కారణం. గర్భిణీ స్త్రీలో పోషకాహార లోపం ఉంటే, ఆమె బిడ్డలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ధూమపానం కాకుండా పర్యావరణం, రోజువారీ ఆహారం కూడా క్యాన్సర్ కు కారణం..చిన్నతనం నుంచి ఊబకాయం ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు..
50 ఏళ్లలోపు, అపై పైబడిన వారిలో క్యాన్సర్ జన్యువులు భిన్నంగా ఉన్నట్లు బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.. ఈ మధ్య కాలంలోక్యాన్సర్ చాలా సింపుల్ గా వ్యాపిస్తుంది.. అందుకే డబ్బుల కన్నా ముందు ప్రాణాలు ముఖ్యం.. ఆరోగ్యం పై శ్రద్ద తీసుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news