Heart Health : రోజూ శృంగారంతో గుండెకు మేలు..

-

శృంగారం కేవలం ఆనందం, ఉత్సాహాన్ని కలిగించడమే కాదు. ఆరోగ్యానికీ తోడ్పడుతుందట. సెక్స్ లైఫ్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందట. శృంగారలేమితో బీపీ పెరుగుతందట, స్లీప్ సైకిల్ అస్తవ్యస్తమవుతుందట. కొన్నిసార్లు మతిమరపూ వస్తుందట. అలాగే రోజూ సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయట. మరి అవేంటో తెలుసుకోండి..?

శృంగారం గుండెకి చాలా ప్రయోజనం చేకూర్చుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి రెండుసార్లు సెక్స్ లో పాల్గొనేవారితో పోలిస్తే సగటున నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువ సార్లు శృంగారంలో పాల్గొనే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధనలో తేలినట్లు వైద్యులు తెలిపారు. సెక్స్ తో శరీరానికి వ్యాయామం లభించడం కూడా దీనికి కారణం కావొచ్చు. శృంగారంలో పాల్గొనేటప్పుడు గుండె వేగం ఒక్కసారిగా పెరిగి సడెన్ గా తగ్గడం వల్ల గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగి వ్యాధులు రాకుండా తోడ్పతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

సెక్స్ చాలా మందికి రిలీఫ్ టూల్ గా పనిచేస్తుందని డాక్టర్లు అంటున్నారు. ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని సూచిస్తున్నారు. వ్యాయామం, ధ్యానం కంటే సెక్స్ వేగంగా పనిచేస్తుందని.. త్వరగా ఒత్తిడి నుంచి బయటపడేస్తుందని చెబుతున్నారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ఆందోళన కూడా తగ్గుతుందట. ఒత్తిడికి శరీరం స్పందించే క్రమంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదులు శృంగారంతో తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ మాటకొస్తే చురుకైన శృంగార జీవనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒకరకంగా ఇదీ ఆందోళన దరిజేరకుండా చూసేదే.

శృంగారంలో పాల్గొన్నప్పుడు నిమిషానికి సుమారు 6 కేలరీలు ఖర్చవుతాయట. ఇది కాస్త వేగంగా నడిచినప్పుడు ఖర్చయ్యే కేలరీలతో సమానం. ఇది అంత ఎక్కువగా అనిపించకపోవచ్చు గానీ దీర్ఘకాలంలో చూస్తే తక్కువేమీ కాదు. శృంగారం మూలంగా తోటపని, నడక, మెట్లు ఎక్కుతున్నప్పుడు తీసుకునేంత ఆక్సిజన్‌ శరీరానికి లభిస్తుంది కూడా. పైగా శృంగారంతో ఉత్సాహం పెరగడం వల్ల వ్యాయామాలు చేయడంపైనా ఆసక్తి పెరుగుతందని వైద్యులు చెబుతున్నారు.

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య జ్ఞాపకశక్తి. ఏ వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుండకపోవడం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. అయితే తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. మెదడు సమర్థంగా పనిచేయటానికీ శృంగారం తోడ్పడుతుందని.. కచ్చితమైన కారణం తెలియదు కానీ జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటినవారిలో మరింత ప్రభావం చూపిస్తున్నట్టు బయటపడింది. భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం మూలంగా మెదడులో జ్ఞాపకశక్తితో ముడిపడిన హిప్పోక్యాంపస్‌ వంటి భాగాలు ప్రేరేపితమవటం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version