షుగర్‌ పేషెంట్స్‌ కోసమే స్పెషల్‌ టిఫెన్స్.. వీటితో మధుమేహం మాటవింటుందట..!

షుగర్‌ పేషంట్స్‌ వైట్‌ రైస్‌ మానేసి రొట్టెలు తినమని వైద్యులు చెప్తుంటారు. అన్నం తినడం అనేది షుగర్ పేషంట్స్‌ పాలిట శాపం లాంటిదే. మరీ రోజు రొట్టెలు అంటే ఏం తింటాం అని షుగర్‌ పేషంట్స్‌ అనే మాట..టిఫెన్ విషయంలో కూడా వీరు నచ్చింది తినలేరు. బరువు ఎక్కువగా ఉన్నవారికే షుగర్‌ వస్తుంది. మరి అలాంటి వారు.. బరువు తగ్గించుకోగలిగితే షుగర్‌ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పుకోబోయే అల్పాహారాలు స్పెషల్‌గా షుగర్‌ పేషెంట్స్‌ కోసమే. వీటని ట్రై చేస్తూ అటు టిఫెన్‌ చేస్తాం. ఇటు షుగర్‌ను కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వీటిని ఉదయం లేదా మధ్యాహ్నం లేదా నైట్‌ డిన్నర్లో అయినా ఏదో ఒక పూట ఆహరంగా తీసుకోవచ్చు.

మెంతి పరోటా

ప్రోటీన్, ఫైబర్ మంచి కార్బోహైడ్రేట్లు మెండుగా ఉండే మేతి పరోటా మధుమేహ రోగులకి చాలా మంచి ఆహారం. ఇది తినడం వల్ల మీకు మంచి పోషకాలు అందించడంతో సకత్తి కూడా ఇస్తుంది. కొద్దిగా గోధుమ పిండిలో కొంచెం కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు, వాము, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, మెంతి ఆకులు వేసుకుని చపాతీ పిండిలాగా బాగా కలుపుకోండి.. కొద్దిసేపు ఆ పిండిని అలానే ఉంచి..కాసేపటి తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకుని చపాతీలాగా రుద్దుకుని నెయ్యితో పరోటా మాదిరిగా కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యంతో పాటు షుగర్ లేవల్స్ అదుపులో ఉండేలాగా చేస్తుంది.

బేసిన్ మేతి చిలా

శనగపిండికి మెంతి ఆకులని జోడించి దోస మాదిరిగా చేసుకోవాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఈ అల్పాహారం డయాబెటిక్ రోగులకి చాలా మంచిది. శనగపిండిలో మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారం, సరిపడినంత ఉప్పు, వాము, మెంతి ఆకులు వేసుకుని దోస పిండిలాగా కలుపుకోవాలి. చాలా త్వరగా అయిపోయే హెల్తీ, టేస్టి బ్రేక్ ఫాస్ట్ ఇది.

ఉడికించిన కోడిగుడ్లు

బరువు తగ్గాలంటే..తప్పని సరిగా కోడిగుడ్డుని అల్పాహారంలో భాగం చేసుకోవాలి.. ఆమ్లెట్, వేపుడుగా కాకుండా ఉడికించిన కోడిగుడ్లు తినడం వల్లే గుడ్డులోని ప్రయోజనాలు పొందవచ్చు. ఒకవేళ ఉడికించిన గుడ్లు తినడం కష్టంగా అనిపిస్తే కొద్దిగా నూనె వేసి అందులో లైట్‌గా ఉడికించిన గుడ్లు వేసి వాటికి ఉప్పు, కారం జోడించి తీసుకుంటే టేస్టీగా లాంగిచేయొచ్చు.

కాలా చన ఛాట్

శనగలను రాత్రంతా నీళ్ళల్లో నానబెట్టాలి. వాటిని పొద్దునే కుక్కర్లో వేసి ఉడికించుకుని అందులో కొద్దిగా బంగాళాదుంప ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయ, మిర్చి ముక్కలు, మసాలా ఛాట్ వేసుకుని తాలింపు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. బంగాళదుంప స్కిప్‌ చేసినా పర్లేదు. షుగర్ పేషెంట్స్‌ అతిగా బంగాళదుంప తినడం అంత మంచిది కాదు.

రాగి దోస

షుగర్ పేషెంట్స్ రాగి పిండితో చేసిన పదార్థాలు తింటే ఆరోగ్యానికి చాలు మంచిది. చిరుధాన్యాలు అన్నీ షుగర్‌ లెవల్స్‌ను, ఓవర్‌ వెయిట్‌ను కంట్రోల్‌ చేస్తాయి. రాగి పిండి, గోధుమ పిండిని కొద్దిగా తీసుకుని అందులో మజ్జిగ వేసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ పిండిటో దోసలు వేసుకోవాలి. దీన్ని గ్రీన్ చట్నీతో కలుపుకుని తింటే ఉంటదీ వీరలెవల్‌ టేస్ట్‌.

ఇన్ని ఉండగా వైట్‌ రైస్‌ తినడం ఎందుకండీ..ఆదివారం రోజు మాత్రమే ఫుల్‌గా రైస్‌ తింటూ..మిగిలిన రోజుల్లో కొద్దిగా రైస్‌ కడుపునిండా వీటిల్లో ఏదో ఒకటి చేసుకుని తింటూ ఉంటే అటు బరువు ఇటు షుగర్‌ రెండూ మన వింటాయ్‌ అంటున్నారు పోషకాహార నిపుణులు.!