గురకతో బాధ పడుతున్నారా..? అయితే ఆ సమస్య నుండి ఇలా బయట పడిపోండి..!

-

కొంత మందికి ఆస్తమాను గురక వస్తూ ఉంటుంది. అయితే గురక వల్ల నిద్ర కూడా డిస్టర్బ్ అవుతుంది. అలానే పక్క వాళ్ళకి కూడా గురక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే బాగా వేగంగా గురక వస్తుంది అంటే రెస్పిరేటరీ సిస్టమ్ లో బ్లాకేజ్ ఏర్పడినట్లు.

 

అయితే ఎక్కువగా గురకతో బాధపడే వాళ్ళు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది. వీటిని ఫాలో అయ్యారంటే కచ్చితంగా గురక సమస్య నుండి బయట పడవచ్చు. అయితే మరి ఇప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా గురక సమస్య నుంచి ఎలా బయటపడాలి అనేది చూద్దాం.

పసుపు:

పసుపు తీసుకోవడం వల్ల గురక సమస్య నుండి బయట పడవచ్చు. పసుపు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అలానే గురక సమస్యను కూడా ఇది తొలగిస్తుంది. రోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తీసుకోండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి. రెగ్యులర్ గా దీనిని ఫాలో అయితే కచ్చితంగా గురక సమస్య నుండి బయట పడవచ్చు.

పెప్పర్ మింట్:

మీరు కొద్దిగా పుదీనా ఆకుల్ని మరిగించి తీసుకోండి లేదంటే ముక్కులో మింట్ ఆయిల్ ని వేసుకోండి. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది.

ఆలివ్ ఆయిల్:

గురకతో బాధపడేవారికి ఆలివ్ ఆయిల్ కూడా బాగా సహాయపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ని ముక్కులో వేసుకుంటే గురక సమస్య తగ్గుతుంది.

తేనే మరియు దాల్చిని:

తేనెని దాల్చిని పొడిలో వేసి ఈ రెండింటినీ ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో వేసుకుని తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల కూడా గురక సమస్య తగ్గుతుంది. అయితే రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని తాగండి. దీంతో గురక తగ్గుతుంది. అలానే కంఫర్ట్ గా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news