చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లు కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. అయితే కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఎలాంటి ఇంటి చిట్కాలను పాటించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
నీళ్లు:
ఎక్కువ నీళ్లు తాగడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చు. నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్ గా ఉండొచ్చు. అలానే ఒంట్లో ఉండే చెడు పదార్థాలు అన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. కనుక కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండండి.
దానిమ్మ జ్యూస్:
దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల సమస్య నుండి బయట పడవచ్చు. దానిమ్మ రసం తాగడం వల్ల ఫ్రీ గా రాళ్లు బయటకు వచ్చేస్తాయి. మీరు దానిమ్మ పండు అయినా తీసుకోవచ్చు లేదంటే జ్యూస్ అయినా తీసుకోవచ్చు.
నిమ్మరసం:
నిమ్మరసం కూడా కిడ్నీలో రాళ్లని బయటికి పంపిస్తుంది. కాల్షియం స్టోన్స్ ని బ్రేక్ చేస్తుంది. ఒక గ్లాసు నిమ్మరసం ఉదయాన్నే పంచదార లేకుండా తీసుకుంటే మంచిది లేదు అంటే రాత్రి డిన్నర్ తర్వాత తీసుకోండి.
గోధుమ గడ్డి:
గోధుమ గడ్డి కూడా కిడ్నీలో రాళ్ల ని బయటికి పంపిస్తుంది. మూత్రం ఎక్కువ సార్లు అయ్యేలా చూస్తుం.ది అలానే రాళ్లను కూడా ఇది బయటికి పంపుతుంది.
తులసి ఆకులు:
తులసి ఆకులు కూడా కిడ్నీలో రాళ్లని బయటకు పంపించడానికి సహాయపడతాయి. ఉదయాన్నే ఒక టీస్పూన్ తులసి రసాన్ని తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్ళు ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే సమస్య నుండి బయట పడడానికి వీలవుతుంది.