క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారణమయ్యే ఈ ఆహారాలను అస్సలు ముట్టుకోవద్దు

-

మీరేం తింటారో అదే మీ ఆరోగ్యం. ఈ సామెత చాలా పాతదైనప్పటికీ అది చాలా నిజం. మీరు తీసుకునే ఆహారాలే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తాయి. అందుకే పరిశుభ్రమైన ఆహారాలు, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని చెబుతుంటారు. మీ ఆహారంలో కొవ్వులు ఎక్కువగా ఉండి, రిఫైన్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటే దానివల్ల వచ్చే నష్టాలను కూడా భరించాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఈ నష్టాలు జీవితాలను శాసించే విధంగా ఉంటాయి. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్త చాలా అవసరం.

 

burger

ప్రస్తుతం క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారణమయ్యే ఆహారాల గురించి తెలుసుకుందాం.

ప్రాసెస్ చేసిన మాంసం

మటన్, చికెన్, చేప, గుడ్లు మొదలైనవి ఆరోగ్యకరమైనవి. ఐతే వాటిని చక్కగా అప్పుడే వమ్డుకుని తినడం వల్ల అందులోని లాభాలను పొందవచ్చు. నిల్వ ఉంచిన ఏ జంతువు మాంసమైనా సరే తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు క్యాన్సర్ కణాల ఉత్పత్తికి దారి తీయవచ్చు. నిల్వ చేసిన మాంసంలో ఉండే కార్సినోజెన్ అనే పదార్థం కారణంగా కడుపు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

ఫ్రై చేసిన ఆహారాలు

ఫ్రై చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకుంటే దానివల్ల క్యాన్సర్ కణాల ఉత్పత్తి కలిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఫ్రై చేసిన బంగాళాదుంపల్లో ఆకృలిమైడ్ అనే విష పదార్థం తయారవుతుంది. ఇది కార్సినోజెనిక్ గా మారి క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారణం అవుతుంది.

రిఫైన్ చేసిన ఉత్పత్తులు

రిఫైన్ చేసిన చక్కర్ గానీ ఇంకా ఇతర ఏ పదార్థమైన కాన్సర్ కణాలను ఉత్పత్తి చేయడానికి కారణంగా ఉండవచ్చు. ఇలాంటి వాటివల్ల అండోత్సార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది.

ఆల్కహాల్, ఇంకా కార్బోనేటెడ్ ద్రావణాలు

వీటి కారణంగా కూడా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. అలాగే ప్యాకేజీ ఫుడ్ తీసుకోవడం కూడా మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news