చలికాలం వస్తే చాలు దగ్గులు, తుమ్ములు తెగ ఇబ్బంది పెట్టేస్తుంటాయి. చల్లటి గాలులు వీచడం వల్ల జలుబు, దగ్గు చాలా తొందరగా వచ్చేస్తాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు మరీ ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారిలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఐతే చలికాలంలో ఇలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో కాలుష్యం కూడా ఒకటి. వాతావరణం కలుషితం కావడం వల్ల శ్వాసకోశ సమస్యలు తెగ వచ్చేస్తుంటాయి.
ఐతే వీటన్నింటినీ తట్టుకోవడానికి రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. ప్రకృతి పరంగా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఇక్కడ చూద్దాం.
కర్క్యుమిన్:
ఆరోగ్యానికి మేలు చేసే పసుపు శాతం కర్క్యుమిన్ లో ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఉండే విష పదార్థాలను దూరం చేసి, రుతువులు మారితే వచ్చే జబ్బులను దూరం చేస్తుంది.
ఆమ్లా:
వాత దోషాన్ని దూరం చేసే అద్భుతమైన మూలికం ఆమ్లా. దీనివల్ల దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవు. ఇందులో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా తోడ్పడుతుంది.
తులసి:
భారతదేశంలో సాంప్రదాయంగా పూజించే తులసి చెట్టు చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో యాంటీ బయాటిక్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉంటాయి. గొంతుని సాఫ్ట్ గా చేయడమే గాక, ఛాతినొప్పులని దూరం చేస్తుంది.
అశ్వగంధ:
నిద్రలేమి, తీవ్ర ఒత్తిడి మొదలగు సమస్యలు ఇబ్బంది పెడుతుంటే అశ్వగంధ మూలికం అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు ఆరోగ్యకరమైన కొవ్వును అందించడంతో విటమిన్ డి శాతం అధికంగా ఉంటుంది.