హెర్బల్ టీ కంటే గర్భిణీలకు ఇవి మంచివి..!

గర్భిణీలు తొమ్మిది నెలలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మంచి పోషకాహారం తీసుకోవాలి. అయితే గర్భిణీలు హెర్బల్ టీలు కంటే కూడా ఈ పానీయాలు తీసుకుంటే మంచివి.

కొబ్బరి నీళ్ళు:

కొబ్బరి నీళ్లు డీహైడ్రేషన్ కి గురై పోకుండా చూసుకుంటాయి. అదే విధంగా మెటబాలిజమ్ ఇంప్రూవ్ కి బాగా ఉపయోగపడతాయి. తక్షణ శక్తిని కూడా ఇవి ఇస్తాయి.

నిమ్మరసం:

నిమ్మలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఫీటల్ ఇమ్యూనిటీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. డీహైడ్రేషన్ అయ్యిపోకుండా చూసుకుంటుంది. అలానే వికారం, వాంతులు వంటివి రాకుండా చూసుకుంటుంది.

తాజా పండ్ల రసాలు:

టమటా, కమలా రసం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని కూడా ఇవి పెంపొందిస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రెగ్యులర్ గా తాగితే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.

బట్టర్ మిల్క్:

డీహైడ్రేషన్ కి గురై పోకుండా చూసుకుంటుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. బట్టర్ మిల్క్ లో విటమిన్ b12, ప్రోటీన్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. మీల్ కి మీల్ కి మధ్యలో బట్టర్ మిల్క్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.

పాలు:

పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాలలో క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, విటమిన్స్ ఉంటాయి. పాలు తాగడం వల్ల ఫీటస్ కి బ్లడ్ సప్లై పెరుగుతుంది. కాబట్టి గర్భిణీలు పాలు కూడా ఎక్కువగా తాగుతూ ఉండాలి.

సొయా మిల్క్:

ప్రెగ్నెన్సీ సమయంలో సోయా మిల్క్ తాగడం కూడా చక్కటి ప్రయోజనాలను ఇస్తుంది. ఎనీమియా సమస్య రాకుండా ఇది చూసుకుంటుంది. మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఆవుపాలు, గేదెపాలు నచ్చని వాళ్ళు సోయా మిల్క్ తీసుకుంటే మంచిది. ఇలా గర్భిణీలు వీటిని తీసుకుంటే ఏ సమస్య లేకుండా ఉండొచ్చు. పైగా ఆరోగ్యం కూడా మరింత బాగుంటుంది.