క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

-

చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది…? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే అది వారి పిల్లలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కుటుంబ చరిత్ర, వ్యక్తి వయసు వలన కూడా క్యాన్సర్ వస్తుంది. అధిక బరువు, హార్మోన్స్ వలన కూడా క్యాన్సర్ రావచ్చు.

జెనెటిక్ టెస్ట్ ద్వారా దీన్ని మనం తెలుసుకోవచ్చు. ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకుంటే ముందుగా జాగ్రత్త పడొచ్చు. అలానే ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిగా లేకపోవడం వలన కూడా క్యాన్సర్ రావచ్చు. ధూమపానం మధ్యపానం అంటువ్యాధులు వలన కూడా క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ ఉందేమో అని అనుమాన పడేవాళ్లు పరీక్షలు చేయించుకోవడం మంచిది.

క్యాన్సర్ లక్షణాలు:

క్యాన్సర్ లక్షణాలు చాలా మందిలో కనపడవు. రక్తస్రావం, నొప్పి, దగ్గు వంటి ఇతర లక్షణాలు ఉంటే క్యాన్సర్ కావచ్చు. అలానే బరువు తగ్గడం లాంటివి జరిగినా అది క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాంటి సమయంలో డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి.

క్యాన్సర్ లో రకాలు:

క్యాన్సర్‌లో వివిధ రకాలు వున్నాయి. మరి వాటినీ చూద్దాం.

రొమ్ము క్యాన్సర్
అండాశయ క్యాన్సర్
పెద్దప్రేగు క్యాన్సర్
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్
ప్రొస్టేట్ క్యాన్సర్స్ మొదలైనవి.

క్యాన్సర్ ట్రీట్మెంట్:

మందులు, ఇమ్యునోథెరపీ క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌ని మెరుగుపరిచాయని డాక్టర్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news