డ్రాగన్ ఫ్రూట్ ని తింటే కలిగే సమస్యలు ఇవే..!

-

డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో సమస్యలను అది తరిమికొడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, డైటరీ ఫైబర్స్, పాలిఫినాల్స్ మొదలైనవి సమృద్ధిగా ఉంటాయి. ఆరోగ్యానికి అందానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇన్ని లాభాలు ఉన్న డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. మరి ఆ నష్టాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

 

ఎక్కువ ఫైబర్:

ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఫైబర్ ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలని తీసుకొస్తాయి. కాబట్టి ఎక్కువ ఫైబర్ వుండే డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల కడుపునొప్పి, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లాంటి ఇబ్బందులకు గురి అవుతుంది. కాబట్టి ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ తినడం మంచిది కాదు.

ఎక్కువ యాంటీఆక్సిడెంట్స్ మంచిది కాదు:

డ్రాగన్ ఫ్రూట్ లో యాంటీఆక్సిడెంట్లు విపరీతంగా ఉంటాయి. అయితే ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు వల్ల ఆక్సిడెంట్ డ్యామేజ్ లాంటి ఇబ్బందులు తీసుకొస్తుంది. కనుక ఎక్కువగా దీనిని తీసుకోవడం మంచిది కాదు.

అలర్జీ:

విపరీతంగా డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఎలర్జీ వంటి ఇబ్బందులు కూడా వస్తాయి. గొంతులో మంట, బర్నింగ్ సెన్సేషన్ లాంటి సమస్యలకు దారితీస్తుంది.

గర్భిణీలకు మంచిది:

గర్భిణీలకు డ్రాగన్ ఫ్రూట్ చాలా మేలు చేస్తుంది. కేవలం గర్భిణికి మాత్రమే కాకుండా కడుపులో శిశువుకి కూడా ఇది చక్కటి ప్రయోజనం ఇస్తుంది. అయితే ఎవరైనా సరే లిమిట్ గా తీసుకోవడం మంచిది పరిమితి దాటి తీసుకుంటే దేని వల్ల అయినా సమస్య వస్తుంది. కాబట్టి అతిగా ఏది తీసుకోకుండా లిమిట్ గా తీసుకోండి

Read more RELATED
Recommended to you

Latest news