కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి కారణాలు ఇవే..!

ఈ మధ్య కాలంలో కిడ్నీ సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా కిడ్నీ లో రాళ్లు ఏర్పడి చాలా మంది బాధ పడుతున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్య ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కిడ్నీ లో రాళ్ల వలన పొత్తికడుపు నొప్పి కలుగుతుంది. మూత్ర విసర్జన సమయం లో మంట కూడా వస్తుంది. అయితే కిడ్నీ లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి అనే దాని వెనుక ప్రత్యేక కారణం ఏమీ ఉండదు.

కిడ్నీ లో రాళ్లు వివిధ కారణాల వలన వస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కిడ్నీ లో రాళ్ల సమస్య వంశపారపర్యంగా కూడా వస్తుంది. పెద్ద వాళ్లలో కనుక కిడ్నీ లో రాళ్ల సమస్య ఉంటే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక కిడ్నీ లో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

షుగర్ పేషంట్లలో వస్తుంది:

షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళకి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి.

వ్యాయామం చేయాలి:

రోజూ వ్యాయామం చేయడం వలన కిడ్నీ లో రాళ్లు ఏర్పడవు. వాకింగ్ జాకింగ్ వంటివి ప్రతి రోజూ చేస్తూ ఉండండి. ఇది కిడ్నీలని ఆరోగ్యంగా ఉండేటట్టు చేస్తుంది.

నీళ్లు తీసుకోండి:

సరిపడా నీళ్లు తాగడం కూడా ఎంతో అవసరం. నీళ్లు తీసుకోవడం వలన కిడ్నీ లో రాళ్ల సమస్య నుండి దూరంగా ఉండడానికి అవుతుంది.

ఎక్కువ ఉప్పు ఉండే ఆహారాన్ని తీసుకోవడం:

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కిడ్నీ లో రాళ్లు ఏర్పడే ఛాన్స్ ఉంటుంది.

ఒబిసిటీ:

ఊబకాయం సమస్యతో బాధ పడే వాళ్ళల్లో కూడా కిడ్నీలో రాళ్లు ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. కిడ్నీ లో ఒక సారి రాళ్లు ఏర్పడితే చికిత్స చేయించుకోవడం చాలా అవసరం లేకపోతే ఇబ్బంది పడాలి. ఒకసారి చికిత్స చేయించుకున్నా మళ్ళీ సమస్య కలగచ్చు కాబట్టి జాగ్రత్త పడాలి.