పెళ్లైన ఆడవాళ్లలో పిల్లలు పుట్టకపోవడానికి కామన్‌ ప్రాబ్లమ్‌ ఇదే..!

-

జీవితంలో పెళ్లి అనేది.. పెద్ద టాస్క్‌.. ఇది ఎప్పుడైతే ఒక మనిషి లైఫ్‌లో జరుగుతుంది.. వారి జీవితం ఆటోమెటిక్‌గా మారుతుంది. ఏదీ ఇంతకుముందులా ఉండదు. నీకు డబ్బు ఉండొచ్చు, జాబ్‌ చేస్తుండొచ్చు.. అయినా నీ లైఫ్‌ మాత్రం మారిపోతుంది. పెళ్లి అయిన తర్వాత అందరూ ఎదురుచూసేది.. పిల్లల కోసం.. ప్రతి స్త్రీ తల్లి అవ్వాలని కోరుకుంటుంది. కానీ ఈ కోరిక మీకుంటే. మీ ఇంట్లోవాళ్లకే ఎక్కువగా ఉంటుంది. దాంతో మీ కోరిక కాస్త అవసరంగా మారిపోతుంది..కొన్నిసార్లు అదే జీవిత లక్ష్యంగా కూడా అవుతుంది..టార్చర్‌ అలా ఉంటుంది మరీ..! కానీ పెళ్లైన చాలామంది అంత ఈజీగా తల్లి కాలేకపోతున్నారట.. గణాంకాలు చెబుతున్నాయి. దీనికి అందరిలో ఉంటే ప్రధాన సమస్య.. ఒవేరియన్ సిస్టులు. వీటినే తెలుగులో అండాశయ తిత్తి అంటారు.
ఈ తిత్తులు.. చిన్న సంచులు మాదిరిగా స్త్రీ అండాశయంలో తయారవుతాయి. వీటిలో ద్రవపదార్థం నిండిపోతుంది. ఈ తిత్తుల వలన సంతానం కలగకుండా ఇబ్బంది ఏర్పడుతుంది. చాలా అండాశయ తిత్తులు సహజంగా ఏర్పడి, ఎటువంటి చికిత్స లేకుండా కొన్ని నెలల్లో మాయం అవుతాయి. కొన్ని మాత్రం తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి. అండాశయ తిత్తి చీలినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది.. అంతర్గత రక్తస్రావం అవుతుంది. అవి కలిగించే తీవ్రమైన సమస్యల్లో ముఖ్యమైనది సంతానం కాకుండా అడ్డుపడడం. వాటి పరిమాణాన్ని బట్టి లక్షణాలు ఆధారపడతాయి.

లక్షణాలు

తిత్తులు పెద్దగా ఉంటే పొత్తు కడుపు భాగం కింద నొప్పి అధికంగా ఉంటుంది.
వికారం, వాంతులు వస్తాయి.
చాలా నిరాశగా ఉంటుంది.
రక్తస్రావం కూడా జరిగే అవకాశం ఉంది.
సెక్స్ సమయంలో విపరీతమైన బాధ కలుగుతుంది.
స్త్రీలలో హార్మోన్ల సమస్యలు, పోలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) వంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.
అంతేకాకుండా పెల్విక్ ఇన్ఫెక్షన్లు, గర్భం ధరించకపోవడం వంటివి కూడా ఉంటాయి.
ఒకసారి అండాసాయ తిత్తులు వచ్చి తగ్గాక మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఎక్కువే.

ఈ లక్షణాలను లైట్‌ తీసుకోకండి..

పిల్లలు కలగకుండా ఉండడం, కడుపునొప్పి అధికంగా రావడం, కడుపు ఉబ్బరం, రుతుక్రమ సమయంలో విపరీతంగా బ్లీడింగ్ అవ్వడం, రుతుక్రమం సమయానికి కాకపోవడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తేలిగ్గా తీసుకోకండి.. వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. సిస్టులకు సరైన సమయంలో చికిత్స అందించకపోతే అండాశయాలు శాశ్వతంగా దెబ్బతింటాయి. దీనివల్ల పూర్తిగా బిడ్డలను కనే అవకాశాన్ని కోల్పోవాల్సి వస్తుంది..

చికిత్స ఎలా ఉంటుంది..

సోనోగ్రఫీ పద్ధతిలో పొట్టలో తిత్తులు ఉన్నాయో లేవో డాక్టర్లు గుర్తిస్తారు. అల్ట్రాసౌండ్ సహాయంతో కూడా వీటిని గుర్తించవచ్చు. అండాశయ తిత్తుల పరిమాణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. వాటి పరిమాణం తక్కువగా ఉంటే హార్మోన్ల చికిత్స చేస్తారు. లేదా శస్త్ర చికిత్స చేసి వాటిని తొలగిస్తారు.
కొన్ని సందర్భాల్లో, అండాశయ తిత్తులు క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి వాటిని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. కొన్ని వాటంతట అవే మాయమవుతాయి. కొన్ని మాత్రం చాలా అరుదుగా క్యాన్సర్‌గా మారి ప్రాణాలను మీదకు తెస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news