గుడ్డును మిరియాలతో కలిపి తింటే బరువు ఈజీగా తగ్గొచ్చట..!

-

గుడ్డు ఆర్యోగానికి మంచిదని, అందులోని పోషకాలు మనల్ని హెల్తీగా చేస్తాయి రోజు తినాలని వైద్యులు అంటుంటారు. లావుగా అవ్వాలనుకునేవాళ్లు, జిమ్‌కు వెళ్లే వాళ్లు కచ్చితంగా గుడ్డు తింటారు. మనం కూడా గుడ్డు తింటే లావు అవుతామని బలంగా నమ్ముతున్నాం.. అసలు గుడ్డు తింటే బరువు తగ్గుతారట..వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు నిపుణులు.. అది ఎలానో చూద్దాం.!

గుడ్డు వల్ల కలిగే.. ప్రయోజనాలు

గుడ్లలో ఖనిజాలు, విటమిన్లు, సెలీనియం, కోలిన్ పుష్కలంగా ఉంటాయి..
గుడ్ల నిర్దిష్ట ఆహారం బరువును సమర్థవంతంగా తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారంలో ఉడికించిన గుడ్లు లేదా మామూలుగా వండిన గుడ్లను చేర్చుకోవచ్చు.
గుడ్డులోని తెల్లసొన బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
జిమ్‌కు వెళ్లే వారికి గుడ్లు చాలా మేలు చేస్తాయి.

నల్ల మిరియాల పొడితో గుడ్లు తింటే..

నల్ల మిరియాలు ప్రతి ఇంట్లో ఉంటాయి. నల్ల మిరియాల పొడిని గుడ్లతో పాటు తీసుకోవడం వల్ల బరువును వేగంగా తగ్గుతారట.. ఎందుకంటే నల్ల మిరియాలు ఒక రకమైన వేడి మసాలా, ఇది జీవక్రియ రేటును బాగా మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ సమస్యను కూడా తొలగిస్తుంది. దీనితో పాటు, శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. గుడ్డు ఆమ్లెట్ మీద, లేదా ఉడికించిన గుడ్లపై నల్ల మిరియాల పొడిని వేసుకుని తినొచ్చు. ఇది కొవ్వును బర్న్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
చాలా మందికి..గుడ్లను ఉడికించుకుని వాటిపై లైట్‌గా ఉప్పు, కారం వేసుకుని తినే అలవాటు ఉంటుంది. దాని బదులు ఇలా నల్ల మిరియాల పొడి వేసుకుని తిని చూడండి.. టెస్ట్‌ బాగుంటుంది.. ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది.. ఇంకెందుకు లేట్‌ షురూ చేసేయండి.! అయితే గుడ్డు ఆరోగ్యానికి మంచిది కదా అని పరిమితికి మించి తినకూడదు.. ఎక్కువ తింటే..కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం లేకపోలేదు. మీ జీర్ణక్రియ శక్తిని బట్టి రోజుకు రెండు నుంచి మూడు వరకూ తినొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...