ఆపిల్ తో మీ అందాన్ని మరెంత పెంచుకోండి..!

ఆపిల్ వలన కేవలం ఆరోగ్యమే కాదు. అందానికి కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుంది. ప్రతి రోజు ఖాళీ కడుపున ఆపిల్ తినడం వల్ల డైజషన్ బాగుంటుంది. అదే విధంగా ఎన్నో సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆపిల్ తొక్కలు కూడా బాగా ఉపయోగ పడతాయి.

ఆపిల్

యాపిల్ తొక్కల తో అందాన్ని మరింత పెంచుకోవచ్చు. ముఖం గ్లో పెంచడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అయితే ఈ రోజు ఆపిల్ వల్ల అందాన్ని ఎలా పెంచుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ముఖం మీద మచ్చలు లాంటివి ఏమైనా ఉంటే ఆపిల్ తొక్కల తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే తొలగిపోతాయి.

దీని కోసం మీరు రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ పౌడర్ తీసుకోవాలి.
ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఓట్ మీల్ పౌడర్ ని వేయాలి.
ఈ రెండింటినీ బాగా కలిపి దానిలో ఒక టీ స్పూన్ తేనె కలపాలి.
ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి ముఖంకి అప్లై చేసుకోండి.
15 నుండి 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి తర్వాత కడిగేసుకోండి.

దీనిని అప్పుడప్పుడు పాటిస్తే మీ గ్లో పెరుగుతుంది మరియు మచ్చలు తగ్గుతాయి. ఇలా ఈజీగా మీరు ఈ ఫేస్ ప్యాక్ ని ప్రయత్నం చేసి మరెంత అందంగా మారిపోవచ్చు. పైగా దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.