సీఎం జగన్ పై Dk అరుణ షాకింగ్ కామెంట్స్..

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు Dk అరుణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Rds దగ్గర ఏపీ చేపట్టిన రైట్ కెనాల్ పనులను వెంటనే నిలిపి వేయాలని.. దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని.. CWC అనుమతి లేకుండానే అక్కడ పనులు జరుగుతున్నాయని మండిపడ్డారు. సీఎం నాటకాలు అడడం తప్ప చిత్త శుద్ధి లేదని విమర్శలు చేశారు Dk అరుణ. ఈ సమస్యపై AP సీఎం జగన్ పై Dk అరుణ షాకింగ్ కామెంట్స్ చేశారు.

dk aruna

సీఎం జగన్ కూడా ఆలోచించాలని… రైతుల పొట్ట కొట్టకూడదన్నారని చురకలు అంటించారు.  మాకు ఎన్ని నీళ్లు అయితే రావాలో అవి ఇచ్చి మిగిలినవి తీసుకెళ్లండని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఇద్దరు ముఖ్యమంత్రిలను కూర్చో బెట్టి నీటి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నం చేసిందని.. పనులు ఆపకుంటే బీజేపీ ఆందోళన చేస్తోందని హెచ్చరించారు. ఇక నైనా ఏపీ తన వెకిలి చేష్టలను అపాలని పేర్కొన్నారు.