చర్మ సంరక్షణ: మెడ భాగంలో నలుపును పోగొట్టే ఇంటి చిట్కాలు..

-

చాలామందిలో మెడభాగం నల్లగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఫీలవుతారు. శరీరమంతా ఒకలా మెడ భాగంలో ఒకలా ఉండడంతో ఆత్మన్యూనతకి లోనవుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ చెప్పే చిన్న చిట్కాలను పాటించండి. ఇవి మీ మెడ మీద నల్లటి భాగాలను సాధారణ రంగులోకి మారుస్తాయి.

కలబంద రసం

ఆయుర్వేదంలో కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది. చర్మ సంరక్షణలో కలబంద రసం బాగా మేలు చేస్తుంది. దీనికొరకు కలబంద రసాన్ని తీసి మెడ భాగంలో వర్తించాలి. కొద్ది సేపయ్యాక చల్లని నీటితో శుభ్రపర్చుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మెడ మీద నల్లటి రంగు తొలగిపోతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

చర్మంపై పేరుకుపోయిన చనిపోయిన కణాలను తొలగించడంలో ఆపిల్ సైడర్ బాగా పనిచేస్తుంది. దీనికోసం 2టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ని కొన్ని నీళ్ళలో కలపాలి. ఆ తర్వాత దాన్ని దూదితో మెడ భాగాల మీద వర్తించాలి. కొద్ది సేపయ్యాక చల్లని నీటితో శుభ్రపర్చుకుంటే సరిపోతుంది.

బాదం నూనె

ముఖం ఛాయని పెంచడానికి బాదం నూనె బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ, బ్లీచింగ్ లక్షణాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. కొన్ని చుక్కల బాదం నూనె తీసుకొని మీ మెడపై కొన్ని నిమిషాలు మసాజ్ చేస్తే సరిపోతుంది.

పెరుగు

రెండు చెంచాల పెరుగుని తీసుకుని మెడ భాగాల మీద పూయండి. 20నిమిషాల తర్వాత నీటితో శుభ్రపర్చుకోండి. ఇందులో ఉండే సహజ ఎంజైములు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

ఇంకా బంగాళా దుంప రసాన్ని మెడపై రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version