తిన్న వెంటనే నిద్రపోవాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా..?

సర్వసాధారణంగా మనకి తిన్న వెంటనే నిద్ర (sleep) పోవాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే దీని వెనుక గల కారణాలు ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాం.. దీని గురించి హెల్త్ ఎక్స్పర్ట్ ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని మనతో పంచుకున్నారు. మరి ఆలస్యమెందుకు వాటికోసం ఇప్పుడే మనం చూద్దాం.

నిద్ర/sleep

నిజంగా ఆహారం ఇంధనం లాగ పనిచేస్తుంది. ఎనర్జీని ఇవ్వడానికి మన పనులు మనం చేసుకోవడానికే ఇలా దేనికైనా సరే ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. మనం తిన్న తర్వాత ఇన్సులిన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆహారం తినేటప్పుడు ఇన్సులిన్ తినక ముందు తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ ని చూసుకుంటాయి.

తినేసిన తర్వాత ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా అలసట వస్తుంది ఈ ప్రక్రియ సర్వసాధారణంగా జరుగుతుంది. కనుక తిన్న తర్వాత నిద్ర వస్తుంది. ఒకవేళ కనుక అలసట బాగా ఎక్కువగా ఉంటే అప్పుడు తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఆహారం జీర్ణం చేసుకోవడం నిజంగా కష్టమైన పని.

ఎక్కువ ఆహారం తీసుకోకూడదు:

తిన్న వెంటనే చాలామంది అలసిపోతారు. ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల ఇది వస్తుంది. ఎంత ఎక్కువ ఎనర్జీని బాడీకి తీసుకుంటే అంత ఎక్కువ అలసట వస్తుంది. కాబట్టి తక్కువ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి.

జీర్ణప్రక్రియ ప్రధాన పాత్ర పోషిస్తుంది:

మన బాడీకి ఎనర్జీ చాలా అవసరం. కేవలం పనులు మరియు వ్యాయామానికి మాత్రమే కాకుండా శ్వాస తీసుకోవడానికి కూడా అవసరం. ఈ ఎనర్జీ అంతా కూడా మనకి ఆహారం ద్వారా లభిస్తుంది. తీసుకునే ఆహారం గ్లూకోస్ కింద మారిపోతుంది. ఇలా ప్రోటీన్స్ లాంటివి క్యాలరీలు కింద మారి ఎనర్జీని ఇస్తాయి.

తీసుకునే ఆహారం చాలా ముఖ్యం:

ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం లో సెరోటోనిన్ ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల బ్రెయిన్ కి స్లీప్ జనరేటింగ్ సిగ్నల్స్ ని పంపిస్తుంది. కాబట్టి ఎక్కువగా సోయా, గుడ్లు, బచ్చలి కూర, చేప, టోఫు మొదలైనవి తీసుకోకుండా ఉండటం మంచిది. అదేవిధంగా అరటి పండ్లు, చెర్రీస్ వంటి వాటిని కూడా దూరంగా ఉండటం మంచిది.

ఫిజికల్ యాక్టివిటీ:

ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల ఎనర్జీ పెరుగుతుంది. నీరసం తగ్గుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి మీరు ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి కనీసం రోజుకు 20 నుండి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి.

ఆహారం తీసుకునే సమయంలో ఆల్కహాల్ లాంటివి తీసుకోకుండా ఉండటం మంచిది. చాలా మందికి తినేసిన తర్వాత సమస్యలు వస్తూ ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యండి.

తినేటప్పుడు వికారం రాకుండా ఇలా చెయ్యండి:

ఆహారం తీసుకునే ముందు నీళ్లు తాగడం మంచిది. దీనివల్ల తినేటప్పుడు వికారం రాదు.
విటమిన్ సి వుండే వాటిని భోజనం ముందు తినండి. అలానే మామిడి పండ్లు, అరటి పండ్లు తీసుకోండి.

సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, గింజలు, నట్స్ వంటి వాటిని ఎక్కువ తీసుకోవడం చేయాలి. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం కూడా మంచిది. ఆల్కహాల్, కెఫిన్ తగ్గించడం మంచిది. ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా మీరు ఉండొచ్చు.